HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Sunrisers Hyderabad Kolkata Knight Riders Face Must Win Game In Race For Playoffs

IPL Playoffs: ‘డూ ఆర్ డై’ పోరులో నిలిచేది ఎవరో ?

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే​ ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇవాళ కోల్‌కతా నైట్‌రైడర్స్ తో

  • Author : Balu J Date : 14-05-2022 - 5:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Playoffs
Playoffs

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే​ ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇవాళ కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరిగే కీలక పోరులో తప్పక గెలవాల్సి ఉంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్లపట్టికలో 7వ స్థానంలో ఉండగా… కేకేఆర్ 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 8వ స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇరు జట్లు ఈ మ్యాచ్ లో కచ్చితంగా గెలవాల్సిన అవసరముంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సీజన్ లో సన్‌రైజర్స్ హైరదాబాద్ చివరిగా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ దారుణంగాఓడిపోగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మాత్రం.. చివరి నాలుగు మ్యాచ్‌లలో రెండింటిలో విజయం సాధించింది., ఇక బ్యాటింగ్‌ పరంగా ఎస్‌ఆర్‌హెచ్‌ సీజన్ ఫస్టాఫ్ లో అద్భుతంగా రాణించినప్పటికీ సెకండాఫ్ లో మాత్రం పేలవంగా విఫలమవుతుతోంది. హైదరాబాద్ బౌలర్లు కూడా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. గత 4 మ్యాచ్‌ల్లో కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో కలిసి కట్టుగా రాణించి ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలని విలియంసన్ సేన భావిస్తోంది.

ఇక సన్ రైజర్స్ , కేకేఆర్ జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. శ్రేయాస్ అయ్యర్ సేనదేపైచేయిలా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 22 మ్యాచ్‌ల్లో పోటీపడగా.. ఇందులో 14 మ్యాచ్‌ల్లో కేకేఆర్ విజయం సాధించింది. మిగిలిన 8 మ్యాచ్‌ల్లో మాత్రమే ఆరెంజ్ ఆర్మీ గెలిచింది. ఇక ఐపీఎల్ 15వ సీజన్‌లో ఏప్రిల్ 15న ఈ రెండు జట్లు ఒకసారి తలపడగా.. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. ఇక ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్‌కు చేరబోయే 4 జట్లలో గుజరాత్‌ టైటాన్స్‌ తొలి బెర్తు కన్ఫర్మ్‌ చేసుకోగా, మిగిలిన 3 స్థానాల కోసం 7 జట్లు పోటీపడుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • hyderabad sunrisers
  • IPL 2022
  • IPL playoffs

Related News

Gandhi Sarovar Musi

Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

గాంధీ సరోవర్ పరిసరాల్లో ఆధ్యాత్మికతను చాటేలా ఒక భారీ మసీదు నిర్మాణానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మసీదు నిర్మాణానికి సౌదీ అరేబియా యువరాజు సహకరించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం అందుతోంది.

  • Revanth Reddy, Allu Arjun

    అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • Kumari Aunty Business

    Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Netflix Office Hyderabad

    Netflix Office : హైదరాబాద్లో నెటిఫ్లెక్స్ ఆఫీస్ ప్రారంభం

  • Yashoda Hospital Fake Doctor

    సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం

Latest News

  • ప్రధాని మోదీకి ఎఫ్‌ఎస్‌యుఐ అత్యవసర లేఖ.. భార‌త్ యుద్ధంలోకి ఎంట‌ర్ అవుతుందా?

  • ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. మెంటర్ బాధ్యతల నుండి తప్పుకున్న పీటర్సన్!

  • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

  • కొత్త అవతారంలో సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ EX.. అదిరిపోయే ఫీచర్లు, కొత్త కలర్!

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

Trending News

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd