Rs 2000 Notes: మీ దగ్గర ఇంకా రూ. 2000 నోట్లు ఉన్నాయా.. అయితే ఇలా కూడా మార్చుకోవచ్చు..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్ల (Rs 2000 Notes)ను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది.
- By Gopichand Published Date - 12:13 PM, Sun - 8 October 23

Rs 2000 Notes: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్ల (Rs 2000 Notes)ను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. ఆ తరువాత దానిని అక్టోబర్ 7, 2023 వరకు పొడిగించారు. ఇప్పుడు రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి, డిపాజిట్ చేయడానికి గడువు ముగిసింది. అయితే గడువు ముగిసిన తర్వాత కూడా మీరు రూ. 2000 నోటును మార్చుకోవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 7 తర్వాత ఏ బ్యాంకు రూ. 2,000 కరెన్సీని అంగీకరించదు. అయితే గడువు తర్వాత కూడా ఈ నోట్లు చట్టబద్ధంగా ఉంటాయి. ఇటువంటి పరిస్థితిలో మీ వద్ద కూడా రెండు వేల రూపాయల నోట్లు ఉంటే గడువు ముగిసిన తర్వాత కూడా మీరు వాటిని మార్చుకోవచ్చు, డిపాజిట్ చేయవచ్చు. నోట్లు ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కడ డిపాజిట్ చేయాలి
సెప్టెంబరు 30న ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం అక్టోబర్ 8 నుండి బ్యాంకులు రూ.2000 నోటును అంగీకరించవు. వారి ఖాతాలలో కూడా డిపాజిట్ చేయవు. అలాగే ఇది ఏ ఇతర నోటుతో మార్పిడి చేయబడదు. అయితే ఒక విధంగా మీరు ఈ నోటును డిపాజిట్ చేసి మార్చుకోవచ్చు.
ఆర్‌బీఐ కార్యాలయానికి వెళ్లాలి
దీని కోసం మీరు RBI 19 ప్రాంతీయ కార్యాలయాలలో ఒకదాన్ని సందర్శించాలి. మీరు ఏదైనా శాఖను సందర్శించడం ద్వారా నోటును మార్చుకోవచ్చు. లేదా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయవచ్చు. అంతేకాకుండా మీరు పోస్టాఫీసు ద్వారా ఆర్‌బిఐ కార్యాలయాలకు కూడా రూ.2000 నోటును పంపవచ్చు.
Also Read: Telangana: సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకానికి 250 మంది మైనార్టీ అభ్యర్థులు ఎంపిక
We’re now on WhatsApp. Click to Join.
జరిమానా విధిస్తారా..?
మీరు ఇంకా రూ. 2,000 మార్చుకోకపోతే ఇప్పుడు మీరు RBI 19 కార్యాలయాలలో దేనికైనా వెళ్లవచ్చు. లేదా పోస్టాఫీసు ద్వారా పంపవచ్చు. 2,000 నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి ఆర్‌బిఐ ఎటువంటి రుసుమును వసూలు చేయదు.
RBI 19 ప్రాంతీయ కార్యాలయాలు
RBI 19 ప్రాంతీయ కార్యాలయాలలో అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం ఉన్నాయి.
ఎన్ని నోట్లు డిపాజిట్ చేయవచ్చు..?
RBI ప్రకారం.. ఏదైనా సంస్థ లేదా వ్యక్తి రూ. 2000 నోటును రూ. 20,000 వరకు ఖాతాలో డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు.