SSC CHSL Tier 2 Exam: ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ టైర్ 2 పరీక్ష తేదీ విడుదల..!
టైర్ 1 పరీక్షలో కనీస అర్హత మార్కులు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 30 శాతం, OBC/EWSకి 25 శాతం, అన్ని ఇతర కేటగిరీలకు 20 శాతంగా నిర్ణయించారు.
- By Gopichand Published Date - 08:47 PM, Thu - 26 September 24

SSC CHSL Tier 2 Exam: ఎస్ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్ టైర్ 2 పరీక్ష (SSC CHSL Tier 2 Exam) తేదీను కమిషన్ తాజాగా విడుదల చేసింది. అలాగే షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు సైతం షెడ్యూల్ కోసం వెబ్ సైట్‌ను చెక్ చేయాలని కమిషన్ సూచించింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ (CHSL) టైర్-2 పరీక్ష తేదీలను ప్రకటించింది. టైర్ 1 పరీక్షలో షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు టైర్ 2 పరీక్షకు హాజరు కావాలి. SSC CHSL టైర్ 2 పరీక్ష నవంబర్ 18న నిర్వహించనున్నారు.
టైర్ 1 పరీక్ష ఎప్పుడు జరిగింది?
SSC CHSL 2024 పరీక్ష తేదీలు అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inలో ప్రకటించబడ్డాయి. అప్డేట్‌ల కోసం క్రమం తప్పకుండా కమిషన్ వెబ్‌సైట్‌ను తనిఖీ చేస్తూ ఉండాలని SSC.. అభ్యర్థులకు సూచించింది. SSC CHSL టైర్ 1 పరీక్ష జూలై 1 నుండి 11 వరకు నిర్వహించారు. ఫలితాలు సెప్టెంబర్ 7న ప్రకటించారు. SSC CHSL LDC, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోస, 39,835 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. 1,630 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ టైర్ 2 పరీక్షకు హాజరవనున్నట్లు ఎస్ఎస్సీ పేర్కొంది.
Also Read: Yamuna Expressway: ఈ ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రయాణం చాలా కాస్ట్‌లీ గురూ..!
కటాఫ్ ఎంత?
టైర్ 1 పరీక్షలో కనీస అర్హత మార్కులు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 30 శాతం, OBC/EWSకి 25 శాతం, అన్ని ఇతర కేటగిరీలకు 20 శాతంగా నిర్ణయించారు. SSC CHSL టైర్ 1లో DEO, DEO గ్రేడ్ A, LDC/JSA – వేర్వేరు పోస్టులకు వేర్వేరు కట్-ఆఫ్ మార్కులు నిర్ణయించబడ్డాయి.
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డిసి), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జెఎస్‌ఎ) కటాఫ్ మార్కులు 157.36168 కాగా ఎస్సీకి 139.68408, ఎస్టీలకు 129.44568, ఒబిసిలకు 156.61665, ఇడబ్ల్యుఎస్ 151. 750 మార్కులుగా నిర్ణయించారు. LDC, JSA పోస్టుల టైర్ 2 పరీక్ష కోసం 39,835 మంది అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడ్డారు. 1,630 మంది అభ్యర్థులు DEO, DEO గ్రేడ్ A పోస్టులకు హాజరుకానున్నారు.