Gotabaya Rajapaksa : రాజీనామా చేయనున్న శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే
- By Prasad Published Date - 09:30 AM, Sun - 10 July 22

కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయనున్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా వేలాది మంది నిరసనకారులు ఆయన అధికారిక నివాసాన్ని ముట్టడించారు. రాజీనామా విషయాన్ని శనివారం అర్థరాత్రి పార్లమెంటు స్పీకర్ మహింద యాపా అబేవర్ధనా ప్రకటించారు. శనివారం సాయంత్రం జరిగిన అఖిలపక్ష నేతల సమావేశం తర్వాత రాజీనామా చేయాలని కోరుతూ అబేవర్దన తనకు లేఖ రాయడంతో రాజీనామా నిర్ణయం గురించి అధ్యక్షుడు రాజపక్సే స్పీకర్‌కు తెలియజేశారు. తాను జూలై 13న రాజీనామా చేస్తానని అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తెలిపారు. నవంబర్ 2020లో ఆయన శ్రీలంక అధ్యక్షుడయ్యారు.తాత్కాలిక అధ్యక్షుడిని నియమించడానికి ఏడు రోజుల్లో పార్లమెంటు సమావేశాలు జరగాలని, పార్లమెంటులో మెజారిటీ కమాండ్‌తో కూడిన కొత్త ప్రధాని ఆధ్వర్యంలో తాత్కాలిక అఖిలపక్ష ప్రభుత్వాన్ని నియమించాలని స్పీకర్ రాజపక్సేతో అన్నారు. తక్కువ వ్యవధిలో ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు.