HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Srh Win Their First Match Of The Season Defeat Csk By 8 Wickets

SRH First Win:రాణించిన బౌలర్లు…సన్ రైజర్స్ బోణీ

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది.

  • Author : Hashtag U Date : 09-04-2022 - 7:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sunrisers Abhisekh
Sunrisers Abhisekh

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. వరుస పరాజయాల తర్వాత డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పై ఘన విజయం సాధించింది. ఈ విజయంలో సన్ రైజర్స్ బౌలర్లు కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ బౌలర్లు సమష్టిగా రాణించి ప్రత్యర్థిని స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు. మోయిన్ అలీ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ ‌లతో 48 సూపర్ బ్యాటింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులకే పరిమితం అయింది. మోయిన్ అలీకి అండగా అంబటి రాయుడు 27 బంతుల్లో 4 ఫోర్లతో 27 , రవీంద్ర జడేజా 15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 23 రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, నటరాజన్ రెండేసి వికెట్లు తీయగా.. మార్క్‌రమ్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.

155 పరుగుల లక్ష్య ఛేదనలో అభిషేక్‌ శర్మ , రాహుల్‌ త్రిపాఠి చెలరేగి ఆడారు. ఫలితంగా సన్ రైజర్స్ మరో 14 బంతులు ఉండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్‌ విలియమ్సన్‌ 32 పరుగులు చేయగా.. అభిషేక్‌ శర్మ 50 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేసాడు. తర్వాత రాహుల్ త్రిపాఠి కూడా ధాటిగా ఆడి జట్టు విజయాన్ని పూర్తి చేశాడు. చెన్నై బౌలర్లలో బ్రావో, ముఖేశ్‌ చౌదరీలకు తలో వికెట్‌ దక్కింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సీఎస్‌కే సీజన్‌లో వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ చెన్నై ఏ మాత్రం స్థాయికి తగినట్టు ఆడలేక పోయింది. అటు కెప్టెన్ గా రవీంద్ర జడేజా మరోసారి పూర్తిగా విఫలం అయ్యాడు.

Photo Courtesy- Twitter 

.@SunRisers win by 8 wickets to register their first win in #TATAIPL 2022.#CSKvSRH pic.twitter.com/aupL3iKv5v

— IndianPremierLeague (@IPL) April 9, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • abhisekh sharma
  • hyderabad sunrisers
  • IPL 2022
  • SRH vs CSK
  • SRH win first match

Related News

    Latest News

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

    • iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు

    • ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

    Trending News

      • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

      • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

      • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

      • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

      • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd