Sky Walk: అంతరిక్షంలో స్పేస్ వాక్.. చరిత్ర సృష్టించనున్న అరబ్ దేశీయుడు
అంతరిక్షంలో మరో చారిత్రక అడుగుకు సర్వం సిద్దమైంది. అరబ్ వ్యోమగామి చరిత్ర సృష్టించనున్నాడు. ఏప్రిల్ 28న స్పేస్ వాక్ చేయనున్నాడు. దీంతో స్పేస్ వాక్ చేసిన తొలి అరబ్ వ్యోమగామిగా చరిత్రలో నిలిచిపోనున్నాడు.
- By Anshu Published Date - 10:51 PM, Fri - 7 April 23

Sky Walk: అంతరిక్షంలో మరో చారిత్రక అడుగుకు సర్వం సిద్దమైంది. అరబ్ వ్యోమగామి చరిత్ర సృష్టించనున్నాడు. ఏప్రిల్ 28న స్పేస్ వాక్ చేయనున్నాడు. దీంతో స్పేస్ వాక్ చేసిన తొలి అరబ్ వ్యోమగామిగా చరిత్రలో నిలిచిపోనున్నాడు. అరబ్ వ్యోమగామి సుల్తాన అల్నెయాడీ ఈ నెల 28న స్పేస్ వాక్ చేసేందుకు అన్ని సిద్దమయ్యాయి. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్ధాన్ బిన్ మహ్మద్ బిన్ రషీర్ అల్ మక్తూమ్ తాజాగా ట్విట్టర్‌లో ఈ విషయాన్ని తెలిపారు.
ఈ సందర్బంగా వ్యోమగామి ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఎలక్ట్రిక్ స్పేస్‌సూట్, అంతరిక్షంలోకి వెళుతున్న వ్యోమగాముల ఫొటోలను పంచుకున్నాడు. నాసా వ్యోమగామి స్టీఫెన్ బోవెన్‌తో కలిసి స్పేస్ వాక్ చేయనున్నాడు. దీనిపై అరబ్ వ్యోమగామి మాట్లాడుతూ.. స్టీఫెన్ బోవెన్‌తో కలిసి స్పేస్‌వాక్ చేయడం చాలా ఆనందంగా ఉందని, దీనికి ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ చారిత్రాత్మక క్షణం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, దీని కోసం జాన్సన్ స్పేస్ సెంటర్‌లో ట్రైనింగ్ తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
అయితే వ్యోమగామికి అనేక విషయాలపై శిక్షణ ఇస్తారు. అంతరిక్ష వాతావరణానికి అనుకూలంగా వారి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఇక శారీర పరిస్థితి, మానసిక స్థితిని తెలుసుకుంటారు. అలాగే రోబోటిక్స్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, ఇంజినీరింగ్ వంటి రంగాలపై అనుభవం సాధించాల్సి ఉంటుంది. అయితే స్పేస్ వాక్ ను ఎక్స్‌ట్రా వెహిక్యూలర్ యాక్టివిటీ అని కూడా పిలుస్తూ ఉంటారు.
ఐఎస్‌ఎస్ చేపడుతు్న ఐదోవ స్పేస్ వాక్ ఇది. దాదాపు 6.5 గంటల పాటు వ్యోమగాయులు వాహనం వెలుపల ఉండాల్సి ఉంటుంది.గతంలో అనేకమంది స్పేస్ వాక్ చేశారు. యూఏఈకు చెందిన వ్యక్తి తొలిసారి స్పేస్ వాక్ చేస్తున్నాడు.