Trains Cancelled : ఈనెల 11 వరకు ఈ రైళ్లు రద్దు.. సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడి
Trains Cancelled : విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ప్రస్తుతం రైల్వే ట్రాక్ లతో ముడిపడిన మెయింటెనెన్స్ వర్క్స్ జరుగుతున్నాయి.
- By Pasha Published Date - 08:27 AM, Mon - 4 September 23
Trains Cancelled : విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ప్రస్తుతం రైల్వే ట్రాక్ లతో ముడిపడిన మెయింటెనెన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. దీంతో ఈ రూట్ లో నడిచే కొన్ని రైళ్లను తాత్కాలికంగా క్యాన్సల్ చేశారు. ఈవిషయాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.
Also read : Today Horoscope : సెప్టెంబరు 4 సోమవారం రాశి ఫలాలు.. వారు ఆవేశపడితే అనర్ధం
- గుంటూరు-విశాఖపట్నం (17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-మచిలీపట్నం (17220) రైలును సెప్టెంబరు 5 నుంచి 10 వరకు క్యాన్సల్ చేశారు.
- విశాఖపట్నం-గుంటూరు (17240) రైలును సెప్టెంబరు 6 నుంచి 11 వరకు క్యాన్సల్ చేశారు.
- విశాఖపట్నం-విజయవాడ (22701), విజయవాడ-విశాఖపట్నం (22702) ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ను సెప్టెంబరు 5, 6, 8, 9 తేదీల్లో క్యాన్సల్ చేశారు.
- గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ (17243), మచిలీపట్నం-విశాఖపట్నం (17219), విశాఖపట్నం-లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లను ఈ నెల 9 వరకు క్యాన్సల్ చేశారు.
- లింగంపల్లి-విశాఖపట్నం (12806) జన్మభూమి ఎక్స్‌ప్రెస్, రాయగడ-గుంటూరు (17244), విజయవాడ-విశాఖపట్నం (12718), విశాఖపట్నం-విజయవాడ (12717) రత్నాచల్‌లను ఈనెల 10 వరకు క్యాన్సల్ (Trains Cancelled) చేశారు.
- తిరుపతి-విశాఖపట్నం (22708) డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ ను 6, 8 తేదీల్లో సామర్లకోట వరకే నడుపుతారు.
- విశాఖలో బయల్దేరాల్సిన విశాఖపట్నం-తిరుపతి (22707) రైలు 7, 9 తేదీల్లో సామర్లకోట స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.
Related News
Summer Special Trains : 15 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ వస్తున్నాయ్.. వివరాలివీ
Summer Special Trains : వేసవి వేళ రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఎక్కడ చూసినా ట్రైన్స్ నిండిపోయి కనిపిస్తున్నాయి.