HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Get Your Horoscope Predictions For All Zodiac Signs In Telugu For Monday September 4th

Today Horoscope : సెప్టెంబరు 4 సోమవారం రాశి ఫలాలు.. వారు ఆవేశపడితే అనర్ధం

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

  • By Pasha Published Date - 07:42 AM, Mon - 4 September 23
  • daily-hunt
Today Horoscope
Today Horoscope

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశి  వారు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ధనలాభం సూచితం. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. మీకు సంబంధం లేని విషయాలకు దూరం పాటించండి. శివాష్టకం పఠించండి. కెరీర్ ఉన్నతికి సంబంధించిన సమాచారం వింటారు. శివుడికి చెరుకురసంతో అభిషేకం చేయండి.

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశి వారిపై ఒత్తిడి ఎక్కువ. మనసుకు ఇబ్బంది కలిగించే సంఘటనలుంటాయి. మొహమాటం కారణంగా శ్రమ పెరుగుతుంది.  వ్యసనాలకు దూరంగా ఉండాలి. సన్నిహితులతో విభేదాలు రావచ్చు. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఓ బ్యాడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. పొదుపు పాటించకపోతే ఇబ్బందులు పడతారు. శివుడిని పంచామృతాలతో అభిషేకం చేయండి.

మిథునం

ఈరోజు మిథునరాశి వారు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల చర్యల వల్ల సమస్యలు పెరుగుతాయి. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గుడ్ న్యూస్ వింటారు. రుణ సమస్యలు ఎదురైనా మిత్రులు ఆదుకుంటారు. కలహ సూచన ఉంది. ఇతరులు అపార్ధం చేసుకునేలా మాట్లాడకూడదు. వ్యసనాలకు దూరంగా ఉండండి.  గోవులకు అరటిపళ్ళు తినిపించండి.

Also read: Keema Pizza: రెస్టారెంట్ స్టైల్ కీమా పిజ్జా ఇంట్లోనే తయారు చేసుకోండిలా?

కర్కాటకం

ఈరోజు కర్కాటక రాశి వారు  కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆచితూచి అడుగువేయాలి. ఆర్ధికంగా నష్టం రాకుండా చూసుకోవాలి. సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలి.  మీ ప్రవర్తనలో మార్పులును గుర్తిస్తారు.  ఏదైనా తప్పుచేస్తే ఈ రోజు మీరు రియలైజ్ అవుతారు. ఆర్థిక లాభాలుంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక సిద్ధం చేసుకోండి. పాలతో శివుడిని అభిషేకం చేయండి.

సింహం

ఈరోజు సింహరాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావచ్చు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేయాలి. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఎవరైనా ఏదైనా చెప్పిన వెంటనే పాటించేయడం సరికాదు. అనుభవజ్ఞుల సలహాలు తీసుకున్నాకే కొత్త ప్రయత్నాలు ప్రారంభించండి.  రాజకీయ చర్చల్లో పాల్గొంటారు. గతంలో కాని పనుల్ని ఇప్పుడు పూర్తి చేస్తారు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. చెరుకురసంతో శివుడికి అభిషేకం చేయండి.

కన్య (Today Horoscope)

ఈరోజు కన్యారాశి వారు అవసరానికి మించి ఖర్చు  చేయొద్దు. అవసరాలకు డబ్బు అందుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది. ఈ రోజు మంచి రోజు. విఘ్నాలను అధిగమిస్తారు. గొడవల్లోకి వెళ్లొద్దు. ఆలోచన విధానంలో పరిపక్వత వస్తుంది. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి.

Also read: Ajith-Shalini : అజిత్‌, షాలిని లవ్ కోడ్ ఏంటో తెలుసా..? సీక్రెట్‌గా ప్రేమించుకుంటున్న టైంలో..

తుల

ఈరోజు తులారాశి వారికి కొన్ని సందర్భాల్లో మనసుకు భయం కలుగుతుంది. ఒత్తిడిని జయించాలి. అదృష్టం కలిసొస్తుంది. శుభవార్త వింటారు. ముఖ్యమైన పని పూర్తవుతుంది. పట్టుదలతో వ్యవహరిస్తే బంగారు భవిష్యత్తు మీ సొంతం. వైవాహిక జీవితానికి సంబంధించి కొనసాగుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఈశ్వరుణ్ణి పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశివారు ప్రలోభాలకు లొంగరాదు. సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఏదో తెలియని భయంతో బాధపడతారు. న్యాయపరమైన వ్యవహారాల్లో చిక్కుకున్నవారికి ఈ రోజు ఉపశమనం లభిస్తుంది. ఆర్థికంగా శక్తిమంతులవుతారు.అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. విఘ్నాలను అవలీలగా అధిగమిస్తారు. పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి.

ధనుస్సు

ఈరోజు ధనుస్సు రాశి వారికి అనవసర ప్రయాణాలుంటాయి. శత్రువులు యాక్టివ్ గా ఉన్నారు.  అప్రమత్తంగా వ్యవహరించాలి. రహస్య విషయాలను బయపెట్టడం సరికాదు.  నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. మీ సున్నిత స్వభావాన్ని ఆసరాగా చేసుకునేవారున్నారు జాగ్రత్త. శివారాధన చేయడం మంచిది.

మకరం

ఈరోజు మకర రాశి వారికి ఎవరితోనైనా వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వివాదానికి దూరంగా ఉండాలి. వ్యతిరేకంగా మాట్లాడేవారున్నారు జాగ్రత్త. ప్రమాదాలకు దూరంగా ఉండండి. ఖర్చుల విషయంలో జాగ్రత్తపడాలి. విద్యార్థులు చదువు విషయంలో ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కి సంబంధించిన వార్తలు అందుతాయి. శివుడిని పూజించండి.

Also read:Feet: వర్షాకాలంలో పాదాల పగుళ్ల సమస్యనా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే?

కుంభం

ఈరోజు కుంభరాశి వారికి శ్రమ పెరుగుతుంది. జీవితంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గుతాయి. శుభవార్త వింటారు. ఆర్ధిక విజయం ఉంది. అభీష్టాలు నెరవేరతాయి. ఒక విషయంలో పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది.  శుభయోగాలున్నాయి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి.

మీనం 

ఈరోజు మీన రాశి వారు సన్నిహితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏ విషయంలోను అశ్రద్ధ వద్దు. మనసు పెట్టి పని చేయండి. రహస్య విషయాలు ఎవరికీ చెప్పకపోవడమే మంచిది.  పని ఒత్తిడి పెరుగుతుంది. తప్పుడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు అధికారుల వద్ద జాగ్రత్తగా వ్యవహరిస్తే శుభమే జరుగుతుంది. ఈశ్వరుణ్ణి పూజించండి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • horoscope
  • horoscope in telugu
  • horoscope today
  • monday
  • September 4th
  • today horoscope

Related News

    Latest News

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd