Software Employee : సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రేమ వివాహం.. భార్యని కొట్టాడని పోలీసుల వేధింపులతో సూసైడ్..
ఇటీవల భార్యపై పలు గొడవలతో తేజ మూర్తి చేయి చేసుకోగా ప్రియాంక ఏలూరు వన్ టౌన్ పోలీసుస్టేషన్ లో కేసు పెట్టింది.
- Author : News Desk
Date : 04-09-2023 - 6:50 IST
Published By : Hashtagu Telugu Desk
మూడు నెలల క్రితం ప్రియాంక అనే అమ్మాయిని ఏలూరు(Eluru)కి చెందిన తేజ మూర్తి వివాహం చేసుకున్నాడు. హైదరాబాదులోని(Hyderabad) ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం(Software Employee) చేస్తూ ప్రేమలో పడ్డ వీరు మూడు నెలల క్రితం వివాహం(Love Marriage) చేసుకున్నారు. ఈ వివాహం అమ్మాయి కుటుంబంలో ఇష్టం లేదని సమాచారం. ఇటీవల భార్యపై పలు గొడవలతో తేజ మూర్తి చేయి చేసుకోగా ప్రియాంక ఏలూరు వన్ టౌన్ పోలీసుస్టేషన్ లో కేసు పెట్టింది.
ప్రియాంక తరుపు వాళ్ళు రాజకీయ పలుకుబడి ఉండటంతో రాజకీయ నాయకుల ఒత్తిడితో తేజ మూర్తిపై పోలీసులు తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారు. ఈరోజు సెటిల్మెంట్ కు రాకపోతే పోలీస్ కేసు పెట్టి అరెస్టు చేస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసుల వేధింపులు తట్టుకోలేక తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయి తేజ మూర్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
8 పేజీల సూసైడ్ నోట్ రాసి తేజ మూర్తి సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ నోట్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్యభర్తల గొడవ విషయంలో పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లో రాసినట్లు సమాచారం. దీంతో పోలీసుల వేధింపుల వలన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు ఆరోపణ చేస్తున్నారు. భార్యాభర్తల గొడవపై పోలీస్ స్టేషన్ కి వెళితే న్యాయం చేయకపోగా వేధించడంతో ఈ ఘోరం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వేధింపులపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
Also Read : Suicide: కడునొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య