Sleep Apnea: స్లిప్ ఆప్నియా అంటే ఏమిటి?…వైద్యులు ఏం చెబుతున్నారు..!
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ బప్పిలహిరి మరణించిన సంగతి తెలిసిందే. గతకొన్నాళ్లుగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ...ముంబయిలోని క్రిటీకేర్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.
- By Hashtag U Published Date - 06:30 AM, Fri - 18 February 22

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ బప్పిలహిరి మరణించిన సంగతి తెలిసిందే. గతకొన్నాళ్లుగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ…ముంబయిలోని క్రిటీకేర్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. బప్పిలహరి అబ్ స్ట్రక్టీవ్ స్లీప్ అప్నియా కారణంగానే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో అసలు ఈ స్లీప్ ఆప్నియా అంటే ఏంటనే చర్చలు మొదలయ్యాయి. అసలు ఈ స్లీప్ ఆప్నియా అంటే ఏమిటి…దాని లక్షణాలు ఏంటో ఓ సారి చూద్దాం.
స్లీప్ ఆప్నియా అంటే ఏంటి..?
స్లీప్ ఆప్నియా నిద్రకు సంబంధించిన రుగ్మత. నిద్రలో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. దీన్నే స్లీప్ ఆప్నియాగా పరిగణిస్తారు. ఈ రుగ్మత చిన్నపిల్లల నుంచి అన్ని వయస్సుల వారిని ప్రభావితం చేస్తుంది. అయితే ఇది ఎక్కువగా 50ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో, ఊబకాయంతో బాధపడుతున్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
చర్చనీయాంశంగా స్లీప్ ఆప్నియా…
బప్పిలహరి మరణాంతరం ఈ స్లీప్ ఆప్నియా రుగ్మత భారతదేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ రుగ్మతతో బాధపడుతున్నవారు సకాలంలో చికిత్స తీసుకోన్నట్లయితే…హైపర్ టెన్షన్, డయాబెటిస్, స్ట్రోక్, కార్డియోమయోపతి, హార్ట్ ఫెయిల్యూర్ వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లక్షణాలు….
గురక, ఉదయం తలనొప్పి, పగటిపూట నిద్రలేకపోవడం లేదా అలసటగా ఉండటం, నిద్రలో నుంచి మెలకువ వచ్చాక నోరు ఎండిపోవడం, ఉక్కిరిబిక్కిరి కావడం, మూడ్ డిస్టర్బ్ , ఆకస్మాత్తుగా నిద్రలోనుంచి మేల్కోనడం ఇవన్నీ కూడా స్లీప్ అప్నియా యొక్క అత్యంత సాధారణ లక్షణాలని ముంబైలోని మసినా హాస్పిటల్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ సంకేత్ జైన్ తెలిపారు.
నిద్రిస్తున్న సమయంలో ఎగువ శ్వాసద్వారాలు మూసుకుపోతాయి. దీని వల్లే కలిగే ఇబ్బంది ఇదే. ఇది కూడా వ్యాధే అయినాకూడా ఒక్కోసారి మనం గుర్తించలేకపోతాం. గొంతులో సున్నితమైన కండరాలు శ్వాసమార్గాన్ని అడ్డుకున్నప్పుడు ఈ పరిస్థితి వస్తుంది. దీంతో నిద్ర మధ్యలోనే శ్వాస సడెన్ గా ఆగిపోవడంతో మెలకువ వస్తుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు నిద్రిస్తున్న సమయంలో పలుసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. ఈ విధంగా శ్వాససరిగ్గా ఆడకపోవడంతో శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి. ఒక్కోసారి ప్రాణం మీదకు వస్తుంది.
ఇక అధికరక్తపోటు వంటి లక్షణాలు అబ్ స్ట్రక్టీవ్ స్లీప్ ఆప్నియా రుగ్మత ఉన్నవారిలో అగుపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వైద్య పరీక్షలతో ఈ వ్యాధిని ముందుగానే నిర్దారించుకోవచ్చు. వైద్యుల సలహాతో తగు జాగ్రత్తల తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.