HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Skill Development Project Full Details Website Launched By Ap Tdp

AP: ‘స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్’ కు సంబంధించి అణువణువు సాక్ష్యాలతో బయటపెట్టిన టీడీపీ..

ఈ ప్రాజెక్ట్ ను ఏపీకి (AP) తీసుకొచ్చిన వారు ఇలా ప్రతి ఒక్కరు ఈ ప్రాజెక్ట్ లో ఎలాంటి తప్పు జరగలేదని, చంద్రబాబు ఏ తప్పు చేయలేదని చెపుతున్నారు.

  • By Sudheer Published Date - 03:37 PM, Fri - 15 September 23
  • daily-hunt
AP TDP
Apskilldevelopmenttruth22

AP TDP : స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ (Skill Development Project) లో అవకతవకలు జరిగాయని..వందల కోట్లు టీడీపీ అధినేత తిన్నాడని ఆరోపిస్తూ వైసీపీ (YCP) ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టి చంద్రబాబు (Chandrababu) ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్ తర్వాత యావత్ ప్రజానీకం చంద్రబాబు అరెస్ట్ ను తప్పు బడుతుంది. వైసీపీ మాత్రం తప్పు చేసాడు కాబట్టే CID అరెస్ట్ చేసిందని చెపుతుంది. మరోపక్క CID సైతం స్పష్టమైన వివరాలు చెప్పకుండా CBI ముందుకు చంద్రబాబు ను తీసుకెళ్లి.. జైలు పెట్టింది.

టీడీపీ మాత్రం కాదు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ సంబదించిన అప్పటికి అధికారులు, ఈ ప్రాజెక్ట్ ను ఏపీకి (AP) తీసుకొచ్చిన వారు ఇలా ప్రతి ఒక్కరు ఈ ప్రాజెక్ట్ లో ఎలాంటి తప్పు జరగలేదని, చంద్రబాబు ఏ తప్పు చేయలేదని చెపుతున్నారు. ఈ తరుణంలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు సంబదించిన ప్రతిదీ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశం తో టీడీపీ పార్టీ .. apskilldevelopmenttruth.com (ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ట్రూత్ డాట్ కామ్) అనే వెబ్ సైట్ ను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఈ వెబ్ సైట్ లో ‘స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్’ కు సంబదించిన ప్రతిదీ ఉంది. ఫొటోస్ , వీడియోస్ , ప్రాజెక్ట్ వివరాలు..ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎంతమందికి ఉపాధి లభించింది..ఎంతమంది శిక్షణ పొందారు..ఎంతమందికి ఐటీ జాబ్స్ వచ్చాయి అనేది..ఈ ప్రాజెక్ట్ చంద్రబాబు తీసుకొస్తే..జగన్ ప్రచారం చేసుకున్న విషయాలను సైతం ఈ వెబ్ సైట్ లో తెలిపారు.

ఇక ఏమేమి చెప్పారంటే..

“స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లోఎలాంటి అవినీతి జరగలేదని నిరూపించే వాస్తవాలను ప్రతిరోజు ప్రజల ముందు ఉంచుతున్నాం. చంద్రబాబునాయుడి లాంటి జాతీయ నాయకుడు తప్పుచేయలేదనే వాస్తవం ప్రపంచవ్యాప్తంగా తెలియాలనే అన్ని ఆధారాలతోకూడిన వాస్తవాలను పబ్లిక్ డొమైల్ పెట్టాలని నిర్ణయించుకున్నాం. apskilldevelopmenttruth.com (ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ట్రూత్ డాట్ కామ్) అనే వెబ్ సైట్ లో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం వెనకున్న ఆవశ్యకత మొదలు మొత్తం ప్రాజెక్ట్ అమలైన తీరు…దానివల్ల లబ్ధిపొందిన వారి వివరాలన్నీ పొందుపరిచాం. 2014 నవంబర్లో సిమెన్స్ సంస్థ నుంచి అప్పటి ప్రభుత్వానికి వచ్చిన ప్రతిపాదన మొదలు, తదనంతరం జరిగిన అన్ని పరిణామాలను వరుసక్రమంలో పూసగుచ్చినట్టు గా వెబ్ సైట్లో వివరించాం. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఏపీలో (AP) టీడీపీ ప్రభుత్వం అమలుచేయకముందే దేశంలో అనేక రాష్ట్రాలు అమలుచేశాయి. గుజరాత్ లో 2014లో, ఝార్ఖండ్ లో 2016లో, తమిళనాడు, కర్ణాటకలో 2017లో అమలు చేశారు. ఆయా రాష్ట్రాల్లో ప్రాజెక్ట్ అమలు.. దాని వెనకున్న విధివిధానాలు సహా, ఏపీలో (AP) మొత్తం ప్రాజెక్ట్ అమలు తీరుని ఆధారాలతో సహా వెబ్ సైట్లో వివరించాం. విభజనానంతర ఏపీలో (AP) దిక్కుతోచని స్థితిలో ఉన్న రాష్ట్ర యువత భవిత కోసం గొప్ప సదుద్దేశంతో చంద్రబాబు చేపట్టిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పనితీరు బాగుందని జగన్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రశంసించింది.

ప్రాజెక్ట్ తీసుకొచ్చి, యువతకు ఉపాధి కల్పించింది టీడీపీ అయితే, అంతా తానే చేశానని జగన్ రెడ్డి ప్రచారం చేసుకున్నాడు

టీడీపీ ప్రభుత్వంలో సమర్థవంతంగా ప్రాజెక్ట్ అమలుచేసినందుకు గాను వచ్చిన అవార్డుని వైసీపీ ప్రభుత్వం స్వీకరించి, తానే అంతా చేసినట్టు చెప్పుకుంది. జగన్ రెడ్డి ఫోటోలతో పత్రికల్లో, ఇతర ప్రసారమాధ్యమాల్లో ప్రజలకు కనిపించేలా భారీగా హోర్డింగులు ఏర్పాటుచేసి, అంతా తామే చేసినట్టు ప్రచారం చేసుకున్నారు. అయినా దానిపై మేం స్పందించలేదు.. ప్రాజెక్ట్ అమలై యువత బాగుపడితే చాలని సంతోషించాం. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన 6 క్లస్టర్లలో దాదాపు 2,17,500 మంది యువత శిక్షణ పొందితే, వారిలో దాదాపు 70వేల మందికి ఉపాధి, ఉద్యోగాలు లభించాయి. ఇంకా కొందరి సమాచారం తెలియాల్సి ఉంది.

టీడీపీ ప్రభుత్వంలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ద్వారా 2,17,000 మంది యువత శిక్షణ పొందితే, 70వేల మందికి ఉపాధి ఉద్యోగాలు లభించాయి

అనంతపురం స్కిల్ డెవలప్ మెంట్ క్లస్టర్లో 37,500 మంది, గుంటూరు క్లస్టర్లో 35,500 మంది, విశాఖపట్నం క్లస్టర్లో 34,000 మంది, తూర్పుగోదావరి క్లస్టర్లో 34,000, కృష్ణా జిల్లా క్లస్టర్లో 39,000 మంది, చిత్తూరు క్లస్టర్లో 37,500 మంది యువత శిక్షణ పొందారు. శిక్షణ పొందిన తర్వాత యువతకు అందించిన సర్టిఫికెట్ల వివరాలు కూడా వెబ్ సైట్లో పొందుపరిచాం. ఈ విధంగా అన్ని వాస్తవాలు ప్రజలకు తెలియాలనే వెబ్ సైట్ ఆవిష్కరించాం. జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ కేంద్రంలో కూడా స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రం ఏర్పాటుచేశాం. అక్కడ ఎవరెవరు శిక్షణ పొంది ఉద్యోగాలు పొందారనే వివరాలు కూడా ఉన్నాయి.

Also Read:  Hyderabad: చంద్రబాబు మద్దతుదారులకు హైదరాబాద్ డీసీపీ వార్నింగ్

చంద్రబాబునాయుడిని జైలుకు పంపడాన్ని తెలుగుజాతి ముక్తకంఠంతో వ్యతిరేకిస్తోంది

ఏమీలేని దానిలో ఏదో జరిగిందని దుష్ప్రచారం చేస్తూ చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపడాన్ని తెలుగుజాతి మొత్తం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తోంది. రూ.370కోట్లు అవినీతి జరిగిందని, చంద్రబాబు నిధులు కాజేశారని కావాలనే సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఐడీ, వైసీపీప్రభుత్వం, అధికారంలో ఉన్నవారు చెప్పేది…చేసేందంతా ముమ్మాటికీ దుష్ప్రచారమే అనడానికి తాము వెబ్ సైట్లో వెల్లడించిన వివరాలే నిదర్శనం. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు అనేది కేబినెట్ ఆమోదంతోనే జరిగింది. దానికి సంబంధించిన కేబినెట్ రిజల్యూషన్, ఇతర జీవోలన్నీ వెబ్ సైట్లో ఉంచాం. సిమెన్స్ సంస్థతో సంప్రదింపులు జరిపి, వారు ఏ రాష్ట్రాల్లో అయితే పనిచేశారో, ఆయా రాష్ట్రాల్లో జరిగిందాన్ని పరిశీలించాకే, ప్రాజెక్ట్ అమలుపై ముందడుగు వేశాం.

క్విడ్ ప్రోకో పదాన్ని తెలుగువారికి పరిచయం చేసింది ఎవరో ప్రత్యేకంగా చెప్పాలా? ఈ ప్రభుత్వ పతనం మొదలైంది కాబట్టే ఇంతపెద్ద తప్పు చేసింది

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో క్విడ్ ప్రోకో జరిగింది అంటున్న వారంతా ముందు అసలు ఆ మాట ఎక్కడ నుంచి పుట్టిందో, ఎవరు దాన్ని తెలుగుప్రజలకు పరిచయం చేశారో తెలుసుకోవాలి. ఆధారాలు లేకుండా, చంద్రబాబునాయుడికి, అచ్చెన్నాయుడికి, లోకేశ్ కు ఫలానా వారి నుంచి డబ్బులు వచ్చాయని నిరూపించకుండా నోటికొచ్చినట్టు ఎలా ఆరోపణలు చేస్తారు? ఆధారాలు లేకుండానే చంద్రబాబుని అరెస్ట్ చేసి, తరువాత విచారిస్తామని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి పతనం మొదలైంది. కాబట్టే ఇంత తప్పుడు పనికి పాల్పడ్డారు. ప్రజా నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేసి, జైలుకు పంపినందుకు ఇంతకింత మూల్యం చెల్లించు కుంటారు.

స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రాలు పరిశీలించకుండా టీడీపీ నేతల్ని ఎందుకు అడ్డుకుంటన్నారు.. కేంద్రాలకు ఎందుకు తాళాలేయిస్తున్నారు?

స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రాల్లో ఎలాంటి పరికరాలు, సాఫ్ట్ వేర్ పరిజ్ఞానం లేదని సీఐడీ, జగన్ రెడ్డి ప్రభుత్వం ఎలా చెబుతాయి? శిక్షణా కేంద్రాల పరిశీలనకు వెళ్లకుండా టీడీపీ నేతల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? కాలేజీల యాజమాన్యాలను బెదిరించి, శిక్షణా కేంద్రాలకు ఎందుకు తాళాలేయి స్తున్నారు? ఇవన్నీ చూస్తేనే అర్థమవుతోంది ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా, అన్యాయంగా చంద్రబాబునాయుడిపై అభాండాలు వేసి, జైలుపాలు చేసిందో. ప్రజలంతా వాస్తవాలు తెలుసుకొని, ఈ నీతిమాలిన ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలి. మా నాయకుడికి ఏమాత్రం సంబంధంలేని అంశంలో ఆయన్ని అన్యాయంగా ఇరికించి, జైలుకు పంపారు కాబట్టే ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు స్వచ్ఛందంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.” అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

తప్పు చేయడం చంద్రబాబు డీ.ఎన్.ఏ లోనే లేదు : టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య

“4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అన్యాయంగా, కక్షసాధింపులో భాగంగా జైలుకు పంపారు. టీడీపీ ఆవిష్కరించిన వెబ్ సైట్ లోని వివరాలు పరిశీలిస్తే ఆయన ఏ తప్పు చేయలేదని, ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రే కావాలని కుట్రతో ఆయనపై అభియోగాలు మోపి జైలుకు పంపారని వెబ్ సైట్ లోని సమాచారం చూసిన వారందరికీ అర్థమవుతుంది. వెబ్ సైట్లోని వివరాలను ప్రతి ఒక్కరూ తెలుసుకొని తెలియని వారికి కూడా తెలియచేయాలని కోరుతున్నాం. తప్పు చేయడం అనేది చంద్రబాబు డీ.ఎన్.ఏ లోనే లేదు. తప్పులు, నేరాలు అన్నీ ఈ ముఖ్యమంత్రి చేసి, ప్రజలకోసం పోరాడేవారిని వేధిస్తూ ఆనం దిస్తున్నాడు.” అని రామయ్య తెలిపారు.

వెబ్ సైట్ ఆవిష్కరణ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనమండలిలో టీడీపీ పక్షనేత యనమల రామకృష్ణుడు, నేతలు చింతకాయల అయ్యన్నపాత్రుడు, నిమ్మల రామానాయుడు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, బీదరవిచంద్ర యాదవ్, భూమి రెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, పరుచూరి అశోక్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read:  Jagan Jail Operation : రాజ‌మండ్రి జైలుపై జ‌గ‌న్ ఆప‌రేష‌న్ ! సూప‌రింటెండెంట్ కావలెను.!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • apskilldevelopmenttruth.com
  • chandrababu
  • skill development Project
  • tdp

Related News

Ap Egg

Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

Production of Eggs : మాంసం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ నాల్గవ స్థానంలో, పాల ఉత్పత్తిలో ఐదవ స్థానంలో, మరియు గేదెల ఉత్పత్తిలో ఆరవ స్థానంలో ఉందని దామోదర్ నాయుడు తెలిపారు

  • Heavy Rains

    Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • Chandrababu Helicopter

    CBN New Helicopter – సీఎం చంద్రబాబుకు కొత్త హెలికాప్టర్..ప్రత్యేకతలు ఇవే..!

  • Ap Universal Health Policy

    Universal Health Policy : యూనివర్సల్ హెల్త్ పాలసీ పూర్తి వివరాలు!

  • Vizag Technology Hub Chandr

    Technology Hub : టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా విశాఖ – చంద్రబాబు

Latest News

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

  • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

  • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

  • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd