UP Madrasas: యూపీ సీఎం యోగి కీలక నిర్ణయం… మదర్సాల్లో ఇకపై….?
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
- By Hashtag U Published Date - 09:28 PM, Thu - 12 May 22

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీలోని మదర్సాలలో జాతీయ గీతం ఆలపించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత‍్తర్వులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ కౌన్సిల్ మదర్సాలలో ప్రతీరోజు తరగతులు ప్రారంభించడానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ యోగి సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ త్రిపాఠి తెలిపారు. జాతీయ గీతం ఆలపించడం మదర్సా విద్యార్థులందరిలో జాతీయతా భావాన్ని పెంపొందిచేలా చేస్తుందని ఆయన అన్నారు.
Madarsa education crucial for minorities. When national anthem is sung, students would learn society's values. Govt is working for upliftment of Madarsa education. Now Madarsa students study religious scriptures alongside math, science, computer: Danish Azad, UP Cabinet Minister pic.twitter.com/8ei2tbcFWT
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 12, 2022