Fast Food: ఫాస్ట్ ఫుడ్ ని అతిగా తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా.?
ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇంటి ఫుడ్ కంటే బయట ఫుడ్ అనగా ఫాస్ట్ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు.
- By Anshu Published Date - 01:00 PM, Thu - 13 October 22

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇంటి ఫుడ్ కంటే బయట ఫుడ్ అనగా ఫాస్ట్ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే చాలామంది ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్ చాలా టేస్టీగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. టేస్టీగా ఉన్నప్పటికీ అటువంటి ఫుడ్డు తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరి ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో చిన్నపిల్లలతో పాటు పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ఈ ఫాస్ట్ ఫుడ్ ని తినడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.
బయట తయారు చేసే ఫాస్ట్ ఫుడ్ లో హానికరమైన కొవ్వులు, పిండి ఉంటాయి. ఈ ఫాస్ట్ ఫుడ్ ని పిల్లలు ఎక్కువగా తినడం వల్ల కండరాల బలహీనత, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ , ఎముకల బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. ఫాస్ట్ ఫుడ్ ని ప్రతిరోజు తినడం వల్ల తలనొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ లో సోడియం, లవణం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనివల్ల శరీరం దారుణంగా దెబ్బతింటుంది. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల మొటిమలతో పాటుగా ఎన్నో రకాల చర్మ సమస్యలు కూడా వస్తాయి. ఫాస్ట్ ఫుడ్ ను అతిగా తింటే కూడా పంటి నొప్పి సమస్య వస్తుంది.
ఫాస్ట్ ఫుడ్ ను తరచుగా తినడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. అంటే దంతాల లైఫ్ టైం తగ్గుతుందన్న మాట. అలాగే ఫాస్ట్ ఫుడ్ ను తింటే కూడా శ్వాస సంబంధిత సమస్యలు మొదలవుతాయి. ఫాస్ట్ ఫుడ్ లో పోషకాలు ఉండక పోవడం వల్ల దీన్ని తినడం వల్ల బాగా బరువు పెరిగిపోవడంతో పాటుగా శక్తిహీనంగా తయారవుతారు. తద్వారా శాస సమస్యలు కూడా తలెత్తుతాయి.