Hyderabad: నగరంలో శ్రీనాథ్ జీ ధ్వజాజీ ఆనంద్ ఉత్సవ్ వేడుకలు
సనాతన ధర్మం విలువలు సమాజంలో మరింత మందికి తెలియజెప్పేలా ఓ కార్యక్రమానికి శ్రీనాథ్ జీ ధ్వజాజీ ఆరోహణ ఉత్సవ సమితి శ్రీకారం చుట్టింది.
- By Praveen Aluthuru Published Date - 07:27 AM, Mon - 6 November 23

Hyderabad: సనాతన ధర్మం విలువలు సమాజంలో మరింత మందికి తెలియజెప్పేలా ఓ కార్యక్రమానికి శ్రీనాథ్ జీ ధ్వజాజీ ఆరోహణ ఉత్సవ సమితి శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది జనవరిలో శ్రీనాథ్ జీ ధ్వజాజీ ఆనంద్ ఉత్సవ్ వేడుకలు నిర్వహించబోతోంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని జలవిహర్ వేదికగా జనవరి 26 నుంచి 28 వరకూ ఈ వేడుకలు జరగనున్నాయి. బంజారాహిల్స్ లో దీనికి సంబంధించిన బ్రోచర్ ను ఆవిష్కరించారు.
హైదరాబాద్ లో తొలిసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టు , తద్వారా దక్షిణ భారతదేశంలో ఆనంద్ ఉత్సవ్ అరంగేట్రం చేయనుందని ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు చైతన్య చెప్పారు. నాథద్వారాలోని శ్రీనాథ్ ఆలయానికి చెందిన తిల్కాయత్ 108 శ్రీ రాకేష్ జీ మహారాజ్, అతని కుమారుడు శ్రీ విశాల్ జీ బావా ద్వారా వైష్ణవ ప్రయోజనాల కోసం ఆనంద్ ఉత్సవాన్ని నిర్వహించే అధికారాన్ని సమితికి కల్పించారు. మన సాంప్రదాయాలు , విలువలు, ఆచారాలపై యువతలో మరింత అవగాహన కల్పించడం మరో ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.
Also Read: Jordan Air Force : ఇజ్రాయెల్ దాడుల వేళ గాజాలోకి జోర్డాన్ విమానం.. ఏమైందంటే ?