HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Shree Cement To Set Up Rs 1500 Crore Cement Plant In Ap

AP Project: ఏపీలో ప్రారంభంకాబోతున్న మరో భారీ ప్రాజెక్ట్‌.. !

ఏపీలో మ‌రో భారీ ప్రాజెక్టు ప్రారంభంకానుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో రూ. 1500 కోట్లతో గ్రీన్‌ ఫీల్డ్‌ సిమెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు శ్రీ సిమెంట్ కంపెనీ ముందుకు వ‌చ్చింది.

  • Author : Hashtag U Date : 20-12-2021 - 7:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cement Prices ACC
Cement Bags

ఏపీలో మ‌రో భారీ ప్రాజెక్టు ప్రారంభంకానుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో రూ. 1500 కోట్లతో గ్రీన్‌ ఫీల్డ్‌ సిమెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు శ్రీ సిమెంట్ కంపెనీ ముందుకు వ‌చ్చింది.ఈ ప్రాజెక్టుని 24 నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 9 రాష్ట్రాలలో సిమెంట్‌ తయారీ, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్లాంట్స్ ని శ్రీ సిమెంట్‌ గ్రూప్ ఏర్పాటు చేసింది.తాజాగా శ్రీ సిమెంట్‌ గ్రూప్‌ నుంచి ఏపీలో మొట్టమొదటి ప్రాజెక్ట్ ప్రారంభంకాబోతుంది.ఈ ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను శ్రీ సిమెంట్‌ లిమిటెడ్‌ ఎండీ హెచ్‌ఎం.బంగూర్, జేఎండీ ప్రశాంత్‌ బంగూర్ క‌లిసి చ‌ర్చించారు.

ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, పారిశ్రామిక వర్గాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలను శ్రీ సిమెంట్ ఎండీకి సీఎం జ‌గ‌న్ వివ‌రించారు. రాష్ట్రాభివృద్ధికోసం ముఖ్యమంత్రి చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని శ్రీ సిమెంట్‌ ఎండీ హెచ్‌ఎం.బంగూర్ అన్నారు. ఒక కంపెనీకి చెందిన ముఖ్యకార్యనిర్వాహణాధికారి ఏరకంగా ఆ కంపెనీ బాగోగులు చూసుకుంటారో.. అలాగే రాష్ట్ర బాగోగులకోసం ముఖ్యమంత్రిగారు కూడా అలాగే పనిచేస్తున్నారని అన్నారు. ప్రజలకు మెరుగైన ఆదాయాలు రావాలని ఆయన ఆకాంక్షిస్తున్నారని.. రాష్ట్రంలో పారిశ్రామికీరణ పెద్ద ఎత్తున జరగాలని సీఎం కోరుకుంటున్నారని బంగూర్ తెలిపారు.

దేశం కంటే రాష్ట్ర వృద్దిరేటు అధికంగా ఉందని… భవిష్యత్తులో కూడా ఇది మరింతగా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనా దృక్పథంతో రాష్ట్రాభివృద్ధి మరింత పురోగమిస్తుందని.. అందువల్లే మేం ఇక్కడ ప్లాంట్‌ ఏర్పాటు చేయబోతున్నామ‌ని బంగూర్ తెలిపారు. శ్రీ సిమెంటు ప్లాంటులో పనిచేసేవారికి జీతాల రూపంలో కాని, పరోక్షంగా ఉపాధి పొందుతున్న వారికి గాని నెలకు కనీసంగా రూ.20 కోట్ల రూపాయలు, రోజుకు కనీసంగా రూ.70 లక్షలు రూపాయలు నేరుగా చెల్లిస్తున్నామ‌ని.. రోజువారీ ఉపాధి కార్యక్రమాల్లో భాగంగా డబ్బును వారికి ఇస్తున్నామ‌న్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cement project
  • Greenfield Cement plan
  • guntur
  • new project
  • shree cement

Related News

Ambati Rambabu Son in Law Upesh

చంద్రబాబు మీద అనుచిత వాక్య పై మా మామ అంబటి రాంబాబు బాధపడుతున్నారు: అల్లుడు ఉపేష్

Ambati Rambabu  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల పట్ల అంబటి రాంబాబు బాధపడుతున్నారని ఆయన అల్లుడు ఉపేష్ అన్నారు. అంబటిని ముందు టీడీపీ శ్రేణులే రెచ్చగొట్టాయని… ఈ క్రమంలోనే ఆయన ఆవేశంలో నోరు జారారని చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటితో నిన్న ఉపేష్ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంబటికి సినిమా చూపిస్తామని కేంద్ర మంత్రి ప

  • ambati rambabu remand అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్

    అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్

Latest News

  • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. బోణీ కొట్టిన టీమిండియా!

  • మరణానికి ముందు కనిపించే సంకేతాలివే!

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీ నుంచి రెండో సాంగ్‌.. అప్డేట్ ఇదే!

  • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

Trending News

    • టీమిండియాకు చెమ‌టలు ప‌ట్టించిన యూఎస్ఏ!

    • టీ20 వరల్డ్ కప్‌.. తొలి మ్యాచ్‌కు ఈ ఆట‌గాళ్లు ఎందుకు దూర‌మ‌య్యారు?

    • ప్రపోజ్ డే కోసం రొమాంటిక్ టిప్స్ ఇవే!

    • భార‌త్ రూ. 725 కోట్ల రూపాయల భారీ డీల్..!

    • ఏపీలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd