Medak Election: మెదక్ లో బీఆర్ఎస్ కు షాక్, మైనంపల్లి రోహిత్ విజయం
తెలంగాణలో ఎన్నికల్లో హస్తం పార్టీ హవా కొనసాగుతోంది.
- By Balu J Published Date - 01:58 PM, Sun - 3 December 23

Medak Election: తెలంగాణలో ఎన్నికల్లో హస్తం పార్టీ హవా కొనసాగుతోంది. మొదటి సారి బరిలో నిలిచిన అభ్యర్థులు సైతం విజయ ఢంకా మోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెదక్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌రెడ్డి విజయం సాధించాడు. తన సమీప బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పద్మాదేవేందర్‌రెడ్డి పై సుమారు 3వేల ఓట్లతో ఓడించారు. అయితే మెదక్ లో మైనంపల్లి హన్మంతరావుకు మంచి పట్టు ఉండటం, రోహిత్ సేవా కార్యక్రమాలు చేయడం కాంగ్రెస్ విజయానికి దోహదపడ్డాయి.
Also Read: Errabelli: పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి