Cherukuri Srinivas : అవయవ దానం వల్ల ఆమె చిరకాలం జీవించే ఉంటారు – చెరుకూరి శ్రీనివాస్
Cherukuri Srinivas : గుంటూరులోని రమేష్ హాస్పటల్ వైద్యులు ఆమె బ్రెయిన్ డెడ్ అని ప్రకటించగా, కుటుంబ సభ్యులు ఇతరులకు జీవదానం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు
- By Sudheer Published Date - 07:53 AM, Fri - 28 March 25
గుంటూరుకు చెందిన చెరుకూరి సుష్మ బ్రెయిన్ డెడ్ కావడంతో, ఆమె కుటుంబ సభ్యులు అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చారు. గుంటూరులోని రమేష్ హాస్పటల్ వైద్యులు ఆమె బ్రెయిన్ డెడ్ అని ప్రకటించగా, కుటుంబ సభ్యులు ఇతరులకు జీవదానం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఆమె గుండెను తిరుపతికి తరలించాల్సిన అవసరం ఏర్పడింది.
మంత్రి నారా లోకేష్ తక్షణ చర్యలు
గుండెను అత్యవసరంగా తిరుపతి ఆసుపత్రికి చేరవేయాల్సిన పరిస్థితిలో రమేష్ హాస్పటల్ యాజమాన్యం నారా లోకేష్‌ను సంప్రదించగా, ఆయన వెంటనే స్పందించారు. గుండెను త్వరగా తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేక విమానం అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకున్నారు. గుంటూరు నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా గన్నవరం విమానాశ్రయానికి తరలించిన గుండె, అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా రేణిగుంటకు ఆపై తిరుపతి ఆసుపత్రికి చేరుకునేలా ఏర్పాట్లు చేయబడ్డాయి.
కుటుంబ సభ్యుల స్పందన
చెరుకూరి సుష్మ భర్త చెరుకూరి శ్రీనివాస్ ఈ సందర్భంలో భావోద్వేగంగా స్పందించారు. “నా భార్య ఆకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. మెడికల్ టీమ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెను కాపాడలేకపోయారు. బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత వైద్యులు అవయవ దానం చేయాలని సూచించగా, మా పిల్లలతో చర్చించి అంగీకరించాము. మా భార్య గుండె తిరుపతిలోని ఒక వ్యక్తికి ప్రాణదానం చేయడం సంతోషకరం. అవయవ దానం వల్ల ఆమె చిరకాలం జీవించే ఉంటారని భావిస్తున్నాము” అని తెలిపారు. ప్రభుత్వ సహకారం హాస్పిటల్ యాజమాన్యం, పోలీసులు అందించిన సహాయంతో ఈ చర్య విజయవంతంగా పూర్తయింది.
SRH vs LSG: హోం గ్రౌండ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్.. లక్నో ఘన విజయం!