IPL 2022: షకీబుల్ ను అందుకే కొనలేదు
బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో కొందరు స్టార్ క్రికెటర్లు అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో మిగిలిపోయారు. ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యుత్తమ ఆటతీరు కనబర్చిన వారు కూడా కనీస ధరకు అమ్ముడు పోలేదు.
- Author : Naresh Kumar
Date : 17-02-2022 - 11:56 IST
Published By : Hashtagu Telugu Desk
బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో కొందరు స్టార్ క్రికెటర్లు అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో మిగిలిపోయారు. ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యుత్తమ ఆటతీరు కనబర్చిన వారు కూడా కనీస ధరకు అమ్ముడు పోలేదు.
ప్రస్తుత ఫామ్, ఫిట్‌నెస్‌ని ఆధారంగా ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఫ్రాంఛైజీలు.. చాలా మంది స్టార్ ఆటగాళ్లను పట్టించుకోలేదు.. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో 204 మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా.. వారి కోసం 10 ఫ్రాంఛైజీలు రూ.550 కోట్లని ఖర్చు చేశాయి.అయితే ఈసారి మెగా వేలంలో బాంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్, కేకేఆర్ మాజీ ఆటగాడు షకీబ్ అల్ హసన్ మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా పోవడంపై అతడి సతీమణి ఉమ్మే అహ్మద్ శిశిర్ తాజాగా స్పందించారు.
ఐపీఎల్ 15వ సీజన్ మెగా వేలానికి ముందు టోర్నీలో పలు షకీబ్ అల్ హసన్ ను కాంటాక్ట్ చేశాయని కానీ శ్రీలంకతో సిరీస్ కారణంగా సీజన్ మొత్తానికి షకీబ్ అందుబాటులో ఉండనని , చెప్పాడని, ఈ కారణంగానే అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదని అహ్మద్ శిశిర్ చెప్పుకొచ్చారు.. అలాగే ఒకవేళ షకీబ్ ఐపీఎల్ ఆడాలనుకుంటే శ్రీలంక సిరీస్ నుంచి తప్పుకునైనా అందులో ఆడేవాడని , కాని అతను ఐపీఎల్ కంటే దేశానికి ఆడటాన్నే గౌరవంగా భావిస్తాడని అహ్మద్ శిశిర్ చెప్పుకొచ్చింది..ఇదిలాఉంటే విదేశీ ఆల్‌రౌండర్ల కోసం ఐపీఎల్ మెగా వేలంలో రూ.కోట్లు కుమ్మరించిన ఫ్రాంఛైజీలు.. షకీబ్ అల్ హసన్ రూ.2 కోట్లకే అందుబాటులో ఉన్నా పట్టించుకోలేదు.
Shakib Al Hasan's wife Sakib Ummey Al Hasan issues a statement after he went unsold in IPL 2022 mega auction.
📸: @Sah75official #IPL2022 #ShakibAlHasan pic.twitter.com/RWOqrEDTRr
— CricTracker (@Cricketracker) February 14, 2022