Muddada Ravichandra: ఏపీ సీఎం కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర
సీనియర్ ఐఎఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యదర్శిగా నియమించింది . తక్షణమే అమలులోకి వచ్చేలా రవిచంద్ర బాధ్యతలను స్వీకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
- By Praveen Aluthuru Published Date - 09:18 PM, Wed - 12 June 24

Muddada Ravichandra: సీనియర్ ఐఎఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యదర్శిగా నియమించింది . తక్షణమే అమలులోకి వచ్చేలా రవిచంద్ర బాధ్యతలను స్వీకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
పరిపాలనా రంగంలో అనుభవ సంపన్నుడైన రవిచంద్ర తన నైపుణ్యాన్ని భూమికకు చేర్చి రాష్ట్ర అభివృద్ధి, ప్రగతికి కృషి చేయాలని కోరారు. కాగా ఈ రోజు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర, హోమ్ మంత్రి అమిత్ షా, ఇతర ప్రముఖుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేశారు.
Also Read: Relationship Tips : ప్రతి అమ్మాయి, అబ్బాయి ఇష్టపడే లక్షణాలు