Suicide : కర్ణాటకలోని హుగ్లీ నదిలోకి దూకి అడ్వకేట్ ఆత్మహత్య.. డిప్రెషన్‌నే కారణమా..?
కర్ణాటకలోని హుగ్లీ నదిలో వంతెనపై నుంచి దూకి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తి తన మోటారు సైకిల్‌ను వివేకానంద సేతుపై
- By Prasad Published Date - 08:44 AM, Sun - 12 March 23

కర్ణాటకలోని హుగ్లీ నదిలో వంతెనపై నుంచి దూకి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తి తన మోటారు సైకిల్‌ను వివేకానంద సేతుపై నిలిపి, రెయిలింగ్‌పైకి ఎక్కి దూకాడు. ఈ సంఘటన శనివారం ఉదయం 7:45 గంటలకు జరిగింది. నదిలోకి దూకిన వ్యక్తి కోసం రోస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టారు. ఆ వ్యక్తి సీల్దా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది, కోల్‌కతా వ్యక్తిగా గుర్తించారు. కోల్‌కతా పోలీసుల విపత్తు నిర్వహణ బృందం సిబ్బంది ఆ వ్యక్తి కోసం వెతుకుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. బ్రిడ్జి వద్ద బైక్‌ను స్వాధీనం చేసుకుని.. వ్యక్తిని గుర్తించామన్నారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. మృతుడు తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారుఉ.

Related News

Road Accident : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం ట్రాక్టర్ ట్రాలీని ఢీకొనడంతో ఇద్దరు