KKR Mistake 2023: కేకేఆర్ చేసిన అతి పెద్ద తప్పిదం ఇదేనట!
గుజరాత్ టైటాన్స్ డేంజరస్ బ్యాట్స్ మెన్ శుభ్‌మన్ గిల్ ఈ సీజన్లో అదరగొట్టాడు. ఆడిన అన్ని మ్యాచ్ లోనూ గిల్ పరుగుల వరద పారించాడు.
- By Praveen Aluthuru Published Date - 12:59 PM, Mon - 29 May 23

KKR Mistake 2023: గుజరాత్ టైటాన్స్ డేంజరస్ బ్యాట్స్ మెన్ శుభ్‌మన్ గిల్ ఈ సీజన్లో అదరగొట్టాడు. ఆడిన అన్ని మ్యాచ్ లోనూ గిల్ పరుగుల వరద పారించాడు. మూడు సెంచరీలతో శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది ఐపీఎల్ ను ఆస్వాదించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ రిలీజ్ చేసిన శుభ్‌మన్ గిల్ ను గుజరాత్ టైటాన్స్ వేలంలో కొనుగోలు చేసింది. అయితే కోల్ కతా చేసిన అతిపెద్ద తప్పు శుభ్‌మన్ గిల్ ను కోల్పోవడమే అని తాజాగా స్టేట్మెంట్ ఇచ్చాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్. 23 ఏళ్ల గిల్ రానున్న కాలంలో భారత జట్టుకు వెన్నెముకగా నిలుస్తాడని స్టైరిస్ అభిప్రాయపడ్డాడు.
కోల్ కతా శుభ్‌మన్ గిల్‌ని వదులుకోవడం ఆ ఫ్రాంచైజీ చేసిన అతిపెద్ద తప్పుగా నేను ఇప్పటికీ నమ్ముతున్నాను అని స్టైరిస్ అన్నారు. అతి తక్కువ వయసులో గిల్ చాలా చక్కగా ఆడుతున్నాడని స్కాట్ తెలిపారు. అయితే గుజరాత్ టైటాన్స్ కు శుభ్‌మన్ ఎంతవరకు న్యాయం చేస్తాడో నాకు తెలియదు. కానీ వచ్చే ప్రపంచ కప్ నాటికి శుభ్‌మన్ భారత జట్టుకు వెన్నెముకగా నిలుస్తాడు. జట్టుకు శుభారంభం అందించి జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు గిల్ పోరాడుతున్నాడని స్టైరిస్ ప్రశంసించాడు.
కేకేఆర్ జట్టులో శుభ్‌మన్ గిల్ ఆడుతున్నప్పటినుండి మనం అతనిని చూస్తూనే ఉన్నాం. కేకేఆర్ జట్టులో తాను ఆడిన ఆటకి, ప్రస్తుతం గుజరాత్ జట్టులో ఆడుతున్న ఆటలో అనేక మార్పులు చేసుకున్నాడని స్కాట్ భావించారు. ఇప్పుడు గిల్ బాధ్యతగా ఆడుతున్నాడు. జట్టుని ముందుండి గెలిపించడంలో బాధ్యత తీసుకుంటున్నాడని ప్రశంసల వర్షం కురిపించాడు. శుభ్‌మన్ బ్యాటింగ్ లైనప్‌కు ఆసరాగా నిలవడం ఆనందంగా ఉంది. అతను విరాట్ కోహ్లీలా కనిపిస్తున్నాడు. అతను తన ఆటపై పూర్తి నియంత్రణలో ఉన్నాడని, బంతి ఎలా వచ్చిన కొట్టగల సత్తా శుభ్‌మన్ గిల్ కు ఉందని చెప్పారు స్కాట్ స్టైరిస్.
Read More: Raashi Khanna : టాప్లెస్ అందాలతో మతి పోగొడుతున్న రాశి కన్నా