Jasprit Bumrah: గుడ్ న్యూస్… జట్టులోకి జస్ప్రీత్ బుమ్రా కంబ్యాక్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నాడు. వెన్నునొప్పి కారణంగా ఏడాది కాలంగా మైదానంలో అడుగుపెట్టని బుమ్రా త్వరలో కంబ్యాక్ కానున్నాడు.
- By Praveen Aluthuru Published Date - 04:16 PM, Sun - 28 May 23

Jasprit Bumrah: టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నాడు. వెన్నునొప్పి కారణంగా ఏడాది కాలంగా మైదానంలో అడుగుపెట్టని బుమ్రా త్వరలో కంబ్యాక్ కానున్నాడు. తాజాగా ఈ డేంజరస్ బౌలర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) లేని లోటు టీమిండియాలో స్పష్టంగా కనిపిస్తుంది. గతేడాది టీమ్ ఇండియా తరఫున ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ కూడా ఆడలేకపోయాడు. ఈ రెండు టోర్నమెంట్లలో టీమిండియా టైటిళ్లను గెలుచుకోవడంలో విఫలమవడంతో భారత్ ఘోరంగా బుమ్రాను కోల్పోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి రెండో క్వాలిఫయర్‌లో నిష్క్రమించిన ముంబై ఇండియన్స్‌కు కూడా అదే పరిస్థితి. ముంబై ఇండియన్స్ లో బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇక జోఫ్రా ఆర్చర్ కూడా లేకపోవడం రోహిత్ సేనకు ఎదురుదెబ్బ తగిలినట్టైంది.
జస్ప్రీత్ బుమ్రా సెప్టెంబర్ 2022 నుండి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయితే తాజాగా జస్ప్రీత్ బుమ్రా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. షూస్ ఫోటో పెట్టి హలో ఫ్రెండ్స్ మనం మళ్లీ కలుస్తున్నాం అని క్యాప్షన్‌లో రాశాడు. దీంతో బుమ్రా తిరిగి జట్టులోకి జాయిన్ అవ్వబోతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. బుమ్రా గతేడాది సెప్టెంబర్ 25న ఆస్ట్రేలియాతో తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తరువాత వెన్ను నొప్పి సమస్య కారణంగా ఆసియా కప్‌కు దూరమయ్యాడు. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ లోనూ బుమ్రా ఆడలేదు.
Read More: Aamir Khan Marriage : త్వరలో అమీర్ ఖాన్ మూడో పెళ్లి ?