Samantha & Anushka: విజయ్ న్యూడ్ లుక్ పై ‘సమంత, అనుష్క’ ట్వీట్స్.. ఇద్దరి రియాక్షన్ ఇదే!
డేరింగ్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ లైగర్.
- By Balu J Published Date - 05:16 PM, Sat - 2 July 22
డేరింగ్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో రౌడీబాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ లైగర్. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా మూవీ టీం రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బట్టలు లేకుండా విజయ్ దేవరకొండ న్యూడ్ కనిపించడంతో హీరోయిన్స్ సైతం రియాక్ట్ అవుతున్నారు.
స్టార్ హీరోయిన్ సమంత విజయ్ దేవరకొండ.. లైగర్ (Liger) మూవీ నుంచి రిలీజైన న్యూడ్ ఫొటోపై కామెంట్స్ చేసింది. సామ్ తన సోషల్ మీడియాలో ‘‘విజయ్‌కి రూల్స్ తెలుసు. తను వాటిని బ్రేక్ చేస్తాడు. తనకు గట్స్ ఎక్కువ. ధైర్యానికి తగ్గ ఫలితం ఉంటుంది’’ అని కామెంట్స్ చేస్తూ ఫొటోను షేర్ చేసుకుంది. సమంత ఇది వరకు విజయ్ దేవరకొండతో కలిసి మహానటి చిత్రంలో నటించింది. అలాగే ఇప్పుడు ఖుషి అనే సౌతిండియన్ చిత్రంలో నటిస్తోంది. ఇక హీరోయిన్ అనుష్క కూడా రియాక్ట్ అయ్యింది. ‘‘పూరి సార్ మీ మ్యూజిక్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా. ఈ మూవీ విజయ్ కెరీర్ లోనే ది బెస్ట్ లా నిలవాలి. విభిన్నమైన కథలు అందిస్తున్న చార్మికి, కరణ్ జోహర్ కు ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేసింది.
Related News
Prabhas Anushka : కన్నప్ప ప్లాన్ అదిరింది.. ప్రభాస్ తో పాటు అనుష్క కూడా..!
Prabhas Anushka మంచు విష్ణు లీడ్ రోల్ లో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కన్నప్ప. మంచు విష్ణు కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్