Hyderabad: కష్టమర్‌పై సేల్స్‌మెన్ ఇనుప రాడ్డుతో దాడి
హైదరాబాద్ లోని ఓ దుకాణంలో షాపింగ్ కి వచ్చిన కష్టమర్ని సేల్స్‌మెన్ ఇనుప రాడ్డుతో బాది తీవ్రంగా గాయపరిచాడు.
- By Praveen Aluthuru Published Date - 04:31 PM, Wed - 5 July 23
Hyderabad: హైదరాబాద్ లోని ఓ దుకాణంలో షాపింగ్ కి వచ్చిన కష్టమర్ని సేల్స్‌మెన్ ఇనుప రాడ్డుతో బాది తీవ్రంగా గాయపరిచాడు. సేల్స్‌మెన్ కస్టమర్ తో దుర్భాషలాడడంతో ఆ వ్యక్తి సేల్స్‌మెన్ ని నిలదీశాడు. సరిగా మాటాడాలని కోరాడు. దీంతో కోపంతో ఊగిపోయిన సేల్స్‌మెన్ కష్టమర్ని ఇనుప రాడ్డుతో బలంగా కొట్టాడు. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
హైదరాబాద్ టోలిచౌకిలో ఉన్న పోడియం మాల్‌లోని విశాల్ మెగా మార్ట్‌లో బట్టలు కొనేందుకు బిలాల్ ఖాన్ మరియు అతని సోదరుడు సులేమాన్ ఖాన్ వచ్చారు. ధర విషయంలో సేల్స్‌మెన్ కస్టమర్లతో దురుసుగా ప్రవర్తించాడు. హీనమైన భాషతో కస్టమర్లతో ప్రవర్తించాడు. దీంతో సరిగా మాట్లాడాలని సేల్స్‌మెన్ ని కోరగా.. పక్కనే ఉన్న ఇనుప రాడ్డుతో బిలాల్ ఖాన్ తలపై బలంగా కొట్టాడు. దీంతో బిలాల్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎ గణేష్ గౌడ్ సేల్స్‌మెన్ పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Read More: Wimbledon: వింబుల్డన్ లో కూడా నాటు నాటు.. ట్విట్టర్‌లో పోస్టర్ రిలీజ్..!