Sachin Tendulkar: వైరలవుతున్న సచిన్ టెండూల్కర్ వీడియో
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన జీవితంలోని ఫోటోలు, వీడియో లను తరచుగా సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో పంచుకుంటారు.
- Author : Siddartha Kallepelly
Date : 16-05-2022 - 6:30 IST
Published By : Hashtagu Telugu Desk
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన జీవితంలోని ఫోటోలు, వీడియో లను తరచుగా సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో పంచుకుంటారు. ఈసారి తన పెంపుడు కుక్కల పట్ల తనకున్న ప్రేమను తెలియచేసేలా ఒక వీడియోను సచిన్ పోస్ట్ చేసాడు. ఆ వీడియోలో తన రెండు పెంపుడు కుక్కలకు సచిన్ స్నానం చేయించాడు.
మాక్స్, స్పైక్ అనే రెండు పెంపుడు కుక్కలకు సచిన్ టెండూల్కర్ స్నానం చేయిస్తూ, వాటి పాదాలను సున్నితంగా కడిగి, టవల్‌తో తుడిచారు. మాక్స్, స్పైక్ కోసం స్పా డే షాంపూని ఉపయోగించానని, దానితో అవి ఎల్లప్పుడూ బొచ్చుగా శుభ్రమైన హెయిర్ తో ఉంటాయని సచిన్ తన వీడియో కింద రాసారు.ఐదు రోజుల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియోకి ఇప్పటివరకు మూడు మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
సచిన్ పెట్టిన వీడియోపై తన ఫాన్స్ సరదా కామెంట్స్ రాస్తున్నారు. సచిన్ క్రికెట్ కి మాత్రమె కాదు, ప్రతిదానికీ దేవుడే అని ఒకరు రాయగా, సచిన్ పెంపుడు కుక్కలు లక్కీ డాగ్స్ అని మరొకరు కామెంట్ చేసారు. సచిన్ లాంటి గొప్ప వ్యక్తి వినయానికి ఇది నిదర్శనమంటూ మరో అభిమాని సచిన్ ని ఆకాశానికి ఎత్తారు.