Wagner Group-Belarus Army : పుతిన్ పై తిరగబడ్డ ప్రైవేట్ ఆర్మీ ..ఇక ఈ దేశానికి ట్రైనింగ్ ఇస్తుందట
Wagner Group-Belarus Army : రష్యా ప్రెసిడెంట్ పుతిన్ పై తిరుగుబాటు చేసిన ప్రైవేట్ ఆర్మీ ఏమైంది ? ఎక్కడికి పోయింది ?
- Author : Pasha
Date : 15-07-2023 - 4:16 IST
Published By : Hashtagu Telugu Desk
Wagner Group-Belarus Army : రష్యా ప్రెసిడెంట్ పుతిన్ పై తిరుగుబాటు చేసిన ప్రైవేట్ ఆర్మీ ఏమైంది ? ఎక్కడికి పోయింది ?
దీనిపై అంతటా హాట్ డిబేట్ జరుగుతున్న తరుణంలో ఒక వార్త తెరపైకి వచ్చింది..
పుతిన్ పై తిరగబడి.. ఆ వెంటనే రాజీకి వచ్చిన వాగ్నర్ గ్రూప్ ఇప్పుడు రష్యా మిత్ర దేశం బెలారస్ లో బిజీగా ఉందని తెలుస్తోంది.
ఉక్రెయిన్, లిథ్వేనియా, పోలాండ్ దేశాల బార్డర్ లో ఉన్న మిన్స్క్ సిటీకి రక్షణగా ఉండే బెలారస్ ఆర్మీకి వాగ్నర్ గ్రూప్ ట్రైనింగ్ ఇస్తున్నట్లు సమాచారం.
ఇందుకోసం వాగ్నర్ గ్రూప్ తో బెలారస్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని అంటున్నారు.
బెలారస్ ఆర్మీకి వాగ్నర్ గ్రూప్(Wagner Group-Belarus Army) ట్రైనింగ్ ఇవ్వనున్న విషయాన్ని ధృవీకరిస్తూ బెలారస్ రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ” మా దేశ సాయుధ దళాలకు వాగ్నర్ గ్రూప్ శిక్షణ ఇస్తుంది. భవిష్యత్తులో వాటి నైపుణ్యాలను మా ఆర్మీకి నేర్పిస్తుంది” అని ఒక ప్రకటనలో తెలిపింది. జూన్ 23న పుతిన్ పై వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు చేయగా.. బెలారస్ అధ్యక్షుడు లుక శెంకో మధ్యవర్తిగా వ్యవహరించారు. వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ తో చర్చలు జరిపారు.
Also read : Dhoni Teases Yogi Babu : యోగిని ఆడుకున్న ధోనీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
భవిష్యత్తులో మా పరిస్థితి ఏంటని ప్రిగోజిన్ ప్రశ్నించగా.. మిత్ర దేశం బెలారస్ లో షెల్టర్ , ఆర్ధిక వనరులను సమకూర్చేందుకు పుతిన్ హామీ ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి. ఈ హామీ తర్వాతే మాస్కో దిశగా వెళ్తున్న తన ప్రైవేట్ ఆర్మీని ప్రిగోజిన్ ఆపేసి, తిరుగుబాటును విరమించుకున్నాడనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. పుతిన్ తో రాజీకి వచ్చిన తర్వాత.. ప్రిగోజిన్ పై రష్యా యొక్క ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSB) నమోదు చేసిన దేశ ద్రోహం కేసును కూడా ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.
Also read : Delhi Liquor Scam: సుఖేష్ కు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్