Russia: నాలుగు దేశాలకు టూరిస్ట్ వీసాలు రద్దు
సౌదీ అరేబియాతో పాటు మరో నాలుగు దేశాలకు టూరిస్ట్ వీసాలను పూర్తిగా రద్దు చేయాలని రష్యా ప్రతిపాదించినట్లు రష్యన్ న్యూస్ ఏజెన్సీ టాస్ నివేదించింది.
- By Praveen Aluthuru Published Date - 07:46 PM, Wed - 13 September 23

Russia: సౌదీ అరేబియాతో పాటు మరో నాలుగు దేశాలకు టూరిస్ట్ వీసాలను పూర్తిగా రద్దు చేయాలని రష్యా ప్రతిపాదించినట్లు రష్యన్ న్యూస్ ఏజెన్సీ టాస్ నివేదించింది. రష్యా పసిఫిక్ నగరమైన వ్లాడివోస్టాక్‌లోని ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ లో జరిగిన ఒక ప్యానెల్ సందర్భంగా డిప్యూటీ విదేశాంగ మంత్రి ఆండ్రీ రుడెంకో మాట్లాడుతూ.. ఎంపిక చేసిన ఆసియా దేశాలకు వీసా నిబంధనలను తొలగించడంలో రష్యా చురుకుగా పనిచేస్తోందని అన్నారు. టూరిస్ట్ వీసాలను పూర్తిగా రద్దు కానున్న దేశాలలో మలేషియా, బహ్రెయిన్, ఒమన్, సౌదీ అరేబియా, బహమాస్ ,బార్బడోస్, హైతీ, జాంబియా,కువైట్, మెక్సికో, ట్రినిడాడ్ మరియు టొబాగో ఉన్నాయి.
Also Read: Jayalalitha: సీనియర్ నటి జయలలిత ఎదుర్కొన్న కష్టాలు