Drone Attack On Moscow : రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి !
Drone Attack On Moscow : సోమవారం తెల్లవారుజామున రష్యా రాజధాని మాస్కో ఉలిక్కిపడింది.
- By Pasha Published Date - 09:20 AM, Mon - 24 July 23

Drone Attack On Moscow : సోమవారం తెల్లవారుజామున రష్యా రాజధాని మాస్కో ఉలిక్కిపడింది. రెండు సూసైడ్ డ్రోన్స్ దూసుకొచ్చి.. నగరంలోని రెండు భవనాలను ఢీకొన్నాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ డ్రోన్ దాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా రక్షణ శాఖ ఆరోపిస్తోంది. ప్రమాదానికి కారణమైన రెండు సూసైడ్ డ్రోన్లలో ఒకదాన్ని.. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న బిల్డింగ్ దగ్గర అడ్డుకొని క్రాష్ అయ్యేలా చేశామని రష్యా ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.
Also read : EPF Balance: మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంతో తెలుసుకోవాలా..? అయితే ఈజీగా తెలుసుకోండిలా..!
“రెండు డ్రోన్‌లను ఉపయోగించి మాస్కో నగరంలోని భవనాలపై ఉక్రెయిన్ ఉగ్రవాద దాడికి యత్నించింది. దాన్ని మేం సమర్ధంగా అడ్డుకున్నాము” అని రష్యా రక్షణ శాఖ టెలిగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది. ఈ ఘటనపై మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ మాట్లాడుతూ.. “డ్రోన్ దాడులు సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగాయి. అయితే ఆ రెండు డ్రోన్లు కూడా కొమ్సోమోల్స్కీ అవెన్యూ సమీపంలోని నివాసేతర భవనాలను ఢీకొన్నాయి. దీనివల్ల ఆ భవనాలకు(Drone Attack On Moscow) పెద్దగా నష్టం వాటిల్లలేదు” అని వెల్లడించారు.