Road Accident : మధ్యప్రదేశ్‌లో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు మృతి
మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా, సింగ్రౌలీ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
- By Hashtag U Published Date - 10:28 AM, Sat - 4 June 22

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా, సింగ్రౌలీ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, పలువురు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందగా, మరో 15 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఖాండ్వాలో రోషని పోలీసు పోస్ట్‌లోని ఖిర్కియా-ఖల్వా రహదారిలోని ధనోరా గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి ట్రాక్టర్-ట్రాలీ బోల్తా పడడంతో ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు మరణించార. మరో 15 మంది గాయపడినట్లు సబ్-డివిజనల్ అధికారి రవీంద్ర వస్కలే తెలిపారు. హర్సూద్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన తర్వాత మేధపాని గ్రామానికి వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీలో సుమారు 35 మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని.. వారు ఖాండ్వా జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వస్కలే చెప్పారు. సింగ్రౌలి జిల్లాలో, అమ్రాహ్వా గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం మోటార్‌సైకిల్‌ను ట్రక్కు ఢీకొనడంతో ఒక వ్యక్తి మరియు బాలుడు మరణించినట్లు మాడా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ నాగేంద్ర సింగ్ తెలిపారు. పిలియన్ రైడింగ్ చేస్తున్న బాలుడి తల్లి గాయపడినట్లు ఆయన తెలిపారు. లారీని సీజ్ చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.