Road Accident : యూపీ లో డీసీఎం వాహనాన్ని ఢీకొట్టిన బస్సు.. 30 మందికి గాయాలు
లక్నో-బహ్రైచ్ హైవేపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు డీసీఎం వాహనాన్ని ఢీకొనడంతో 30
- By Prasad Published Date - 10:23 AM, Fri - 12 August 22

లక్నో-బహ్రైచ్ హైవేపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు డీసీఎం వాహనాన్ని ఢీకొనడంతో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన గంట తర్వాత బైక్‌పై వెళ్లే వ్యక్తి వెనుక నుంచి బస్సును ఢీకొట్టడంతో మరో ప్రమాదం జరిగింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు బహ్రైచ్‌కు వెళుతుండగా చందన్‌పూర్ గ్రామ సమీపంలో రామ్‌నగర్ పోలీస్ సర్కిల్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నట్లు రాంనగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంతోష్ సింగ్ తెలిపారు. ఇద్దరు మహిళలు సహా ఏడుగురికి తీవ్రగాయాలు కాగా జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.