Accident : హైదరాబాద్లో విషాదం.. స్కూల్ బస్ ఢీకొని చిన్నారి మృతిv
హైదరాబాద్‌లోని బాచుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఎనిమిదేళ్ల బాలికను స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ
- By Prasad Published Date - 01:26 PM, Wed - 2 August 23

హైదరాబాద్‌లోని బాచుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఎనిమిదేళ్ల బాలికను స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలిక మృతి చెందింది. రెడ్డిల్యాబ్స్ కంపెనీలో ఉద్యోగి అయిన కిషోర్ తన కూతురు దీక్షిత (8)ని స్కూల్‌లో దింపేందుకు బైక్‌పై వెళ్తున్నాడు. దురదృష్టవశాత్తు, పాఠశాల బస్సు వారి బైక్‌ని ఢీకొట్టింది. దీంతో దీక్షిత కిందపడిపోయిన తరువాత బస్సు వెనుక చక్రాల బాలికపైకి ఎక్కాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ రహీమ్ అతివేగంగా నడపడం వల్లే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. బస్సు డ్రైవర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.