2 Killed : ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
ఆదిలాబాద్‌లో మావల మండల కేంద్రం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-నాగ్‌పూర్ జాతీయ రహదారి 44
- Author : Prasad
Date : 16-02-2023 - 6:21 IST
Published By : Hashtagu Telugu Desk
ఆదిలాబాద్‌లో మావల మండల కేంద్రం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-నాగ్‌పూర్ జాతీయ రహదారి 44 వద్ద రెండు మోటర్‌బైక్‌లను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనదారులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్‌కు చెందిన పెయింటర్ సూరపం దత్తు (35), తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన కిరాణా దుకాణం యజమాని ఫిరోజ్ (34) రెండు బైక్‌లపై ఆదిలాబాద్ వైపు వెళ్తుండగా తమిళనాడు నుంచి వస్తున్న లారీ.. ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. దత్తు అక్కడికక్కడే మృతి చెందగా, ఫిరోజ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తుది శ్వాస విడిచాడు. లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.