Road Accident: కువైట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి!
అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందినట్లు సమాచారం
- By Balu J Published Date - 04:48 PM, Sat - 26 August 23

Road Accident: కువైట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందినట్లు సమాచారం. మృతుడు గౌస్‌బాషా (35) అతని భార్య (30), ఇద్దరు కుమారులు ఈ ప్రమాదంలో మృతి చెందారు.. గౌస్‌బాషా రాజంపేట పట్టణంలోని ఎగువగడ్డలో ఉన్న అమ్మమ్మ తాతల వద్ద ఉంటూ స్థానిక ఓ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నట్లు తెలుస్తోంది.
అనంతరం తన స్వగ్రామమైన మదనపల్లెకి వెళ్లారు. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లి వివాహం చేసుకుని స్థిరపడ్డారు.బెంగళూరు నుంచి కువైట్‌కి వెళ్లిన గౌస్‌బాషా, ఆయన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి శుక్రవారం కారులో వెళ్తూ అదుపు తప్పి కారు బోల్తా పడిన సంఘటనలో కుటుంబం మృతి చెందినట్లు సమాచారం. రోడ్డు ప్రమాదం జరిగింది వాస్తవమేనని, మృతి చెందినట్లు చెబుతున్న వ్యక్తికి ఫోన్ చేస్తే అందుబాటులోకి రావడం లేదని.. దీని బట్టి చూస్తే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని.. వారి మృతదేహాలను చూసే వరకు నిర్ధారించలేమని గౌస్‌బాషా సమీప బంధువులు తెలిపారు.
Also Read: Forest Trek Park: చిల్కూరులో ఫారెస్ట్ ట్రెక్ పార్కు ప్రారంభం, సరికొత్త థీమ్‌తో వెల్ కం!