Revanth Reddy: ఆదివారం రేవంత్ ప్రచార షెడ్యూల్
రేపు ఆదివారం ఆరు నియోజకవర్గాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నారాయణపేట్, దేవరకద్ర, మహబూబ్ నగర్, కామారెడ్డి, పఠాన్ చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో రేవంత్ ప్రచార సభల్లో పాల్గొంటారు
- Author : Praveen Aluthuru
Date : 25-11-2023 - 10:29 IST
Published By : Hashtagu Telugu Desk
Revanth Reddy: రేపు ఆదివారం ఆరు నియోజకవర్గాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నారాయణపేట్, దేవరకద్ర, మహబూబ్ నగర్, కామారెడ్డి, పఠాన్ చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో రేవంత్ ప్రచార సభల్లో పాల్గొంటారు. ఉదయం 10గంటలకు నారాయణపేట్ బహిరంగసభలో పాల్గొంటారు. ఆ తర్వాత 11 గంటలకు దేవరకద్ర బహిరంగసభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మహబూబ్ నగర్ జనసభలో పాల్గొని ప్రచారాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2గంటలకు రాహుల్ గాంధీతో కలిసి కామారెడ్డి బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక సాయంత్రం 5.30 గంటలకు పఠాన్ చెరు జనసభలో అలాగే సాయంత్రం 6.30 గంటలకు శేరిలింగంపల్లి జనసభకి హాజరవుతారు.
Also Read: Pitch Report: IND vs AUS రెండో టీ20 పిచ్ రిపోర్ట్