Vizag Vijayawada Flights: మళ్లీ వైజాగ్ – విజయవాడ మధ్య విమాన సేవలు
Vizag Vijayawada Flights: విజయవాడ మరియు విశాఖపట్నం మధ్య ఉదయపు విమాన సేవలను (Vizag Vijayawada Flights)మళ్లీ ప్రారభించబోతున్నారు
- By Sudheer Published Date - 09:53 PM, Mon - 5 May 25

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు (Union Minister Ram Mohan Naidu) గుడ్ న్యూస్ తెలిపారు. విజయవాడ మరియు విశాఖపట్నం మధ్య ఉదయపు విమాన సేవలను (Vizag Vijayawada Flights)మళ్లీ ప్రారభించబోతున్నారు. ఈ విమాన సేవలు జూన్ 1, 2025 నుండి తిరిగి ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర రాజధానిలో ఒకటైన విజయవాడను ఆర్థిక రాజధాని విశాఖపట్నంతో నేరుగా అనుసంధానించేందుకు ఈ మార్గం కీలకంగా నిలవనుంది.
Earthquake : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం..పరుగులు తీసిన ప్రజలు
ఈ విమాన మార్గాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్ నిర్వహించనుంది. తాజా షెడ్యూల్ ప్రకారం.. విజయవాడ నుండి ఉదయం 7:15 గంటలకు విమానం బయలుదేరి, విశాఖపట్నం కు 8:25 గంటలకు చేరుకుంటుంది. తిరిగి విమానం విశాఖపట్నం నుండి ఉదయం 8:45 గంటలకు బయలుదేరి, 9:50 గంటలకు విజయవాడ చేరుతుంది. ఈ టైమింగ్ తరచుగా ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యం దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి రామ్ మోహన్ నాయుడు మాట్లాడుతూ.. “ప్రాదేశిక అనుసంధానమే సమగ్ర అభివృద్ధికి మార్గం. విజయవాడ-విశాఖ మధ్య విమాన సేవల పునరుద్ధరణ రాష్ట్ర ప్రయాణికులకు మేలు చేస్తుంది. రెండు నగరాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్త అభివృద్ధి లక్ష్యాలకు తోడ్పడుతుంది” అని తెలిపారు.