Rashmika and Vijay : ముంబై వీధుల్లో రష్మిక, విజయ్ చెట్టాపట్టాల్!
ప్రతి ఒక్కరూ ఆదివారం నాడు తమ సన్నిహితులతో ఓ చిన్న క్యాచ్‌అప్‌ని ఇష్టపడతారు.
- By Balu J Published Date - 12:55 PM, Mon - 20 December 21
ప్రతి ఒక్కరూ ఆదివారం నాడు తమ సన్నిహితులతో ఓ చిన్న క్యాచ్‌అప్‌ని ఇష్టపడతారు. ఇటీవల, రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కూడా బాంద్రాలో సరదాగా గడిపారు. ‘గీత గోవిందం, డియర్ కామ్రెడ్’ మూవీల్లో బెస్ట్ ఫెయిర్ అనిపించుకుంది ఈ జంట. ఏ మాత్రం సమయం దొరికినా విహరయాత్రలకు వెళ్తుంటారు. కొద్దిరోజుల క్రితం విజయ్ దేవరకొండ లైగర్ మూవీ కోసం యూఎస్ లో ఉండగా, రష్మిక కు సమయం దొరకడంతో వెంటనే అక్కడ వాలిపోయింది. ఇప్పుడు ముంబై వీధుల్లో ఇద్దరు కలిసి తిరగడంతో ఫొటోలు వైరల్ అయ్యాయి. డేటింగ్ వార్తలపై ఈ జంటను ప్రశ్నిస్తే.. మేం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని సమాధానమిచ్చారు చాలాసార్లు.
PICS: Rashmika Mandanna and Vijay Devarakonda opt for semi-casual looks as they step out together on Sunday#RashmikaMandanna #VijayDeverakonda https://t.co/waND2J92DK
— Pinkvilla South (@PinkvillaSouth) December 20, 2021