HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Rare Brain Disease Kerala Caused Free Living Amoebae Water

Kerala: కేరళలో భయభ్రాంతులకు గురి చేస్తున్న మరో వ్యాధి.. లక్షణాలు ఇవే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాధులు చాలా ఉన్నట్లు కొత్త కొత్త అరుదైన వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల కాలంలో

  • Author : Anshu Date : 07-07-2023 - 5:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kerala
Kerala

ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాధులు చాలా ఉన్నట్లు కొత్త కొత్త అరుదైన వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇలా అరుదైన వ్యాధులు ఎక్కువగా వెలుగులోకి వస్తూ మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఈ అరుదైన వ్యాధులను వాటి లక్షణాలు మందులను కనుక్కోవడానికి తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కేరళలో మరొక అరుదైన వ్యాధి వెలుగులోకి వచ్చింది. కేరళలోని తీర ప్రాంతంలో ఉన్న అలప్పుజా జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ వ్యాధిని గుర్తించారు.

ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే పేరు గల ఈ వ్యాధి కారకాన్ని ఒక 15 ఏళ్ల బాలుడు శరీరంలో గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. అయితే కలుషిత నీటిలో స్వేచ్చగా జీవించే అమీబా కారణంగా ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు వెల్లడించారు. కాగా స్థానికంగా పనవల్లీ ప్రాంతానికి చెందిన పదిహేనేళ్ల వ్యక్తి తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరాడు. తలనొప్పి, వాంతులు, మూర్చ వంటి ఇతర లక్షణాలు రోగిలో గమనించిన వైద్యులు షాంపుల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. దీంతో అమీబా కారణంగా సోకే అరుదైన వ్యాధి కారకం అతనిలో ఉన్నట్లు గుర్తించారు.

చికిత్సను ప్రారంభించామని తెలిపారు. రోగి శరీరంలోకి ముక్కు ద్వారా వ్యాధి కారకం ప్రవేశిస్తుందని వైద్యులు వెల్లడించారు. అటువంటి వ్యాధి సోకినప్పుడు కలుషిత నీటితో స్నానం చేయకూడదని తెలిపారు. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన అనంతరం మానవ శరీరంలోని మెదడుపై దాడి చేస్తుందని వెల్లడించారు. తీవ్ర జ‍్వరం, తలనొప్పి, వాంతులు, మూర్చకు సంబంధించిన లక్షణాలు ఉంటాయని తెలిపారు. 2017లో ఇదే ప్రాంతంలో ఇలాంటి బ్యాక్టీరియా కేసు నమోదైనట్లు వైద్యులు స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amoebae
  • amoebae water
  • brain disease
  • kerala

Related News

Union Cabinet approves name change of Kerala to 'Keralam '

సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

ఇకపై ‘కేరళం’గా పేర్కొనే ప్రతిపాదనకు మంగళవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పలు మార్లు కేంద్రాన్ని అభ్యర్థించగా తాజాగా ఆ ప్రక్రియ వేగం అందుకుంది.

  • The Kerala Story 2

    The Kerala Story 2: మరో చీకటి కోణం..ది కేరళ స్టోరీ2 ట్రైలర్‌ ఇంత ఘోరమా

Latest News

  • Social Media : 10 కోట్ల ఫాలోవర్లతో ఇన్స్టాలో మోదీ రికార్డ్

  • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

  • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

  • ర‌ష్మిక‌కు విజయ్ దేవరకొండ తల్లి ఇచ్చిన కానుక ఏమిటో తెలుసా?

  • ASUS : హైదరాబాద్ లో ఆసుస్ విస్తరణ

Trending News

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd