Road Accident : కాలేజీ బస్సును ఢీ కొన్న లారీ.. తప్పిన పెను ప్రమాదం
ప్రకాశం జిల్లా సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. యన్ ఇ సి కాలేజీ బస్సును....
- Author : Prasad
Date : 16-09-2022 - 11:52 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రకాశం జిల్లా సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. యన్ ఇ సి కాలేజీ బస్సును లారీ ఢీకొట్టింది. వినుకొండ నుంచి నరసరావుపేట ఇంజనీరింగ్ (NEC) కాలేజీ కి విద్యార్ధులతో బస్సు వెళ్తుంది. బస్ లో సుమారు 40 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు.వీరిలో కొంతమందికి గాయలైయ్యాయి. గాయాలైన విద్యార్థులను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అద్దంకి నుండి పిడుగురాళ్ల వైపు వెళ్తున్న లారీ అతివేగంతో రావడం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. లారీ డ్రైవర్ ను సంతమాగులూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.