President of Sri Lanka: శ్రీలంక కొత్త అధ్యక్షుడు ఈయనే!
శ్రీలకం దేశానికి తదుపరి అధ్యక్షుడిగా (తాత్కాలిక అధ్యక్షుడు) రణిల్ విక్రమసింఘేను శ్రీలంక పార్లమెంటు బుధవారం ఓటు వేసింది.
- Author : Balu J
Date : 20-07-2022 - 1:04 IST
Published By : Hashtagu Telugu Desk
సంక్షోభంలో ఉన్న శ్రీలకం దేశానికి తదుపరి అధ్యక్షుడిగా (తాత్కాలిక అధ్యక్షుడు) రణిల్ విక్రమసింఘేను శ్రీలంక పార్లమెంటు బుధవారం ఓటు వేసింది. మొత్తం 219 ఓట్లకు గాను 134 ఓట్లు సాధించారు. 2020లో జరిగిన గత పార్లమెంట్ ఎన్నికల నాటికి మొత్తం 145 సీట్లు ఉన్న అధికార పార్టీలోని ఒక వర్గం విక్రమసింఘేకు మద్దతు ఇచ్చింది. పోటీలో ఉన్న అధికార పార్టీ నాయకుడు అలహప్పెరుమకు ఇతర విభాగంతో పాటు చివరిసారిగా 54 సీట్లు గెలుచుకున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ మద్దతు కూడా ఉందని నివేదించింది. ఇదిలావుండగా శ్రీలంకలోని భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే మాట్లాడుతూ శ్రీలంక ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరణకు భారతదేశం సహాయం చేస్తుందని అన్నారు.