RGV : పవన్ అండ్ పాల్.. మధ్యలో దూరిన మిస్టర్ వివాదం..!
- Author : HashtagU Desk
Date : 04-03-2022 - 4:22 IST
Published By : Hashtagu Telugu Desk
మిస్టర్ వివాదం ఆర్జీవీ మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్ సాక్షిగా చేసిన కామెంట్స్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. మామూలుగానే పవన్ అండ్ పీకే ఫ్యాన్స్‌ని ఓ రేంజ్‌లో ఆటాడుకునే ఆర్జీవీ, ఈసారి వయా కేఏ పాల్‌ను యూజ్ చేసుకుని పవన్ పై సెటైర్స్ వేశాడు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. తాజాగా పవన్‌ను ఉద్దేశిస్తూ కేఎ పాల్ మాట్లాడుతూ, పవన్ ఫ్యాన్స్‌కు ఏమాత్రం నీతి, నిజాయితీ ఉన్నా పీకే ఫ్యాన్స్ అందరూ ప్రజాశాంతి పార్టీలో చేరాలని పాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
పీకే ఫ్యాన్స్ ప్రజాశాంతి పార్టీలో చేరిగే 42 మంది ఎంపీలను గెలుపించుకుని తాను ప్రధానమంత్రి అవుతానని, ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌ను ఏపీకి ముఖ్యమంత్రిని చేస్తానని కేఏపాల్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కేఏ పాల్ వ్యాఖ్యల పై స్పందించిన రామ్ గోపల్ వర్మ, పవన్ గురించి కేఏ పాల్ మాట్లాడిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. హేయ్ పవన్ సార్.. కాబోయే ప్రధాని చెప్పేది విను అని సెటరికల్‌గా కామెంట్ చేశాడు. దీంతో ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.
Hey @PawanKalyan sirrrr, ,please listen to the would be P M of INDIA. pic.twitter.com/TzUnFpZDJZ
— Ram Gopal Varma (@RGVzoomin) March 3, 2022