Rajinikanth : సీఎం యోగీ కాళ్లు మొక్కడం ఫై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్
యోగులు, సన్యాసిలు, బాబాల పాదాలను తాకి వారి ఆశీర్వాదం తీసుకోవడం నాకు మొదటి నుండి అలవాటు
- Author : Sudheer
Date : 22-08-2023 - 11:18 IST
Published By : Hashtagu Telugu Desk
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) యూపీ సీఎం యోగి కాళ్లు మొక్కడం (UP CM Yogi Adityanath feet) ఫై సర్వత్రా చర్చగా మారింది. స్టార్ హీరో అయ్యి ఉండి..తన కన్నా చిన్న వయసు ఉన్న యోగి కాళ్లు మొక్కడం ఏంటి అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రోజు రోజుకు ఇది మరింత వివాదస్పదంగా మారుతుండడం తో రజనీకాంత్..తాను కాళ్లు మొక్కడం వెనుక ఉన్న అసలు విషయాన్నీ తెలిపారు.
తనకు యోగులు, సన్యాసిలు, బాబాల పాదాలను తాకి వారి ఆశీర్వాదం తీసుకోవడం నాకు మొదటి నుండి అలవాటు. వారు ఎక్కడ కనిపించిన, వారిని కలుసుకున్న ముందుగా వారి కాళ్లను తాకి ఆశీర్వాదం తీసుకుంటాను.. వారు నా కంటే వయసులో చిన్నవారైనా సరే నేను ఆ పని చేస్తాను. అందుకే యోగి ఆదిత్యనాథ్ పాదాలకు నమస్కరించాను. అందులో అంతకు మించి వేరే ఉద్దేశ్యం ఏమిలేదని స్పష్టం చేసారు. రజని స్పష్టత ఈ వివాదానికి తెరపడినట్లు అయ్యింది.
ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్ (Jailer) భారీ విజయాన్ని సాధించింది. ఆగష్టు 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతోంది. కేవలం 10 రోజుల్లోనే రూ.500 కోట్లు కలెక్ట్ చేసి రజని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ చాలా చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది.
Read Also : Chiranjeevi Car collection : మెగాస్టార్ చిరంజీవి వద్ద ఎన్ని బ్రాండ్ కార్లు ఉన్నాయో తెలుసా..?