HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Chiranjeevi Cars List

Chiranjeevi Car collection : మెగాస్టార్ చిరంజీవి వద్ద ఎన్ని బ్రాండ్ కార్లు ఉన్నాయో తెలుసా..?

ఇండస్ట్రీ లో అడుగుపెట్టి కోట్లు సంపాదించిన చిరంజీవికి బ్రాండ్ కార్లు వాడడం ఎంతో ఇష్టం.

  • Author : Sudheer Date : 22-08-2023 - 11:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chiranjeevi Cars List
Chiranjeevi Cars List

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి..నేడు మెగాస్టార్ గా ఇండస్ట్రీ కి గాడ్ ఫాదర్ అయ్యాడు. 68 ఏళ్ల వయసుకు వచ్చినప్పటికీ ఇంకా యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను , అభిమానులను అలరిస్తున్నాడు. నేడు చిరంజీవి పుట్టిన రోజు (Megastar Chiranjeevi Birthday) సందర్బంగా అభిమానులు మెగా సంబరాలు జరుపుకుంటున్నారు. పలు సేవ కార్యక్రమాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇదే క్రమంలో చిరంజీవి తాలూకా విశేషాలు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇండస్ట్రీ లో అడుగుపెట్టి కోట్లు సంపాదించిన చిరంజీవికి బ్రాండ్ కార్లు వాడడం ఎంతో ఇష్టం. అందుకే ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను చిరు వాడుతుంటారు. మార్కెట్ లోకి ఏ కొత్త కారు వచ్చిన దానిపై ఫోకస్ చేస్తుంటాడు. బాగుందనిపిస్తే వెంటనే కోనేస్తుంటాడు. ప్రస్తుతం చిరంజీవి గ్యారేజ్ లో ఎలాంటి కార్లు ఉన్నాయి..వాటి ధరలు ఏంటి..అనేవి తెలుసుకుందాం.

రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ‘ఫాంటమ్’ (Rolls Royce Phantom) చిరంజీవి గ్యారేజిలో ఉంది. దీని ధర సుమారు రూ. 8 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. ఈ కారుని రామ్ చరణ్ చిరంజీవి 53వ పుట్టినరోజు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ రోల్స్ రాయిస్ ఫాంటమ్ అద్భుతమైన డిజైన్ కలిగి 6.8 లీటర్ వి12 న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 460 Bhp పవర్ అండ్ 720 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ (Toyota Land Cruiser)

భారతీయ మార్కెట్లో విడుదలకాక ముందే ఈ కారును చిరంజీవి దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కార్లను ఎక్కువగా రాజకీయ నాయకులు వినియోగిస్తారు. సేఫ్టీ పరంగా ప్రసిద్ధి చెందిన ఈ కారు చాలామంది సెలబ్రిటీలు వాడుతుంటారు. దీని ప్రారంభ ధర మార్కెట్లో రూ. 1 కోటి కంటే ఎక్కువే.

రేంజ్ రోవర్ వోగ్ (Range Rover Vogue)

ల్యాండ్ రోవర్ కంపెనీకి రేంజ్ రోవర్ వోగ్ ను కూడా చిరంజీవి వాడుతుంటారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వోగ్ కారు కంటే కూడా పాత వెర్షన్ అత్యంత శక్తివంతమైన ఇంజిన్ కలిగి ఉంది. దీని ధర కూడా రూ. కోటి కంటే ఎక్కువే అని తెలుస్తుంది. కార్లతో పాటు చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన ఒక ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది. మొత్తం మీద చిరంజీవి చిత్రసీమలో అడుగుపెట్టి దాదాపు రూ. 1650 కోట్లకు పైగానే ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తుంది. కేవలం చిరంజీవే కాదు ఈయన ద్వారా మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మిగతా వారు కూడా గట్టిగానే సంపాదించారు ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప.

Read Also : Chiranjeevi Birthday Special : టాలీవుడ్ ‘గాడ్ ఫాదర్’ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • Chiranjeevi 2023 birthday
  • Chiranjeevi Birthday
  • Chiranjeevi car models
  • Chiranjeevi new cars

Related News

Chiranjeevi, SS Rajamouli, Jr NTR among Tollywood Celebrities Congratulate Team India

T20 World Cup : చరిత్ర సృష్టించిన టీమిండియా..సినీ ప్రముఖుల రియాక్షన్ ఇలా..!!

Chiranjeevi, SS Rajamouli, Jr NTR among Tollywood Celebrities Congratulate Team India  టీమిండియా టీ20 ప్రపంచకప్ 2026 విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు కూడా జట్టుకు అభినందనలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి జట్టు చూపించిన పట్టుదల, టీమ్‌వర్క్‌ను ప్రశంసిస్తూ దేశాన్ని గర్వపడేలా చేసిన విజయమని పేర్కొన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనను కొనియాడుతూ ఈ విజయం 14

  • Chiranjeevi to Receive NTR National Award at Gaddar Film Awards 2025

    చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

  • Megamument

    Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

Latest News

  • ఢిల్లీ మద్యం కేసు.. కవితకు CBI నోటీసులు

  • Suryakumar Yadav : అక్షర్ పటేల్ కు క్షేమపణలు చెప్పిన కెప్టెన్ సూర్య..ఎందుకని ?

  • Lover Suicide : పెళ్లికి ఆలస్యం చేస్తుందని మనస్థాపంతో ప్రేమికుడు ఆత్మహత్య

  • విశాఖలో క్యాప్‌ జెమిని 20 వేల ఉద్యోగాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రతిపాదన

  • Husnabad Suicide : భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య

Trending News

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd