HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Rajasthan Royals 59 All Out

RR vs RCB: ఆర్సీబీ బౌలర్ల ధాటికి ఆర్ఆర్ విలవిల: 59 పరుగులకే ఆలౌట్

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఆర్సీబీ బౌలర్ల ముందు రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు 59 పరుగులకే ఆలౌట్ అయింది.

  • By Praveen Aluthuru Published Date - 07:23 PM, Sun - 14 May 23
  • daily-hunt
RR vs RCB
957ee5faba

RR vs RCB: జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఆర్సీబీ బౌలర్ల ముందు రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు 59 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులోని టాప్ బ్యాట్స్ మెన్స్ ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరారు. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో RCB 112 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది.

ఆర్సీబీ బౌలర్ల ముందు రాజస్థాన్ బ్యాట్స్‌మెన్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. స్టార్ బ్యాట్స్‌మెన్‌లతో కళకళలాడే రాజస్థాన్ టాప్ బ్యాటింగ్ ఆర్డర్ ఆర్సీబీ బౌలర్లను ఏ మాత్రం ఎదుర్కోలేక చతికిల పడింది. యశస్వి జైస్వాల్ మరియు జోస్ బట్లర్ ఖాతా కూడా తెరవబడలేదు. సంజూ శాంసన్ చెత్త షాట్స్ ఆడుతూ చిరాకు తెప్పించాడు. ఆర్ఆర్ జట్టులో తొలి ముగ్గురు చెత్త ఆటతో విలియన్ బాట పట్టడంతో జట్టు మొత్తం 59 పరుగులకే కుప్పకూలింది.

59 పరుగుల స్కోరు వద్ద ఆలౌట్ కావడమే కాకుండా రాజస్థాన్ రాయల్స్ చెత్త రికార్డులను నమోదు చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ మూడో అత్యల్ప స్కోరుతో సరిపెట్టుకుంది. అదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రెండవ అత్యల్ప స్కోరును సొంతం చేసుకుంది. అంతకుముందు 2009లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో పింక్ ఆర్మీ కేవలం 58 పరుగులకే ఆలౌట్ అయింది.

A formidable performance from @RCBTweets as they claim a mammoth 112-run victory in Jaipur 🙌

They climb to number 5️⃣ on the points table 👏🏻👏🏻

Scorecard ▶️ https://t.co/NMSa3HfybT #TATAIPL | #RRvRCB pic.twitter.com/BxkMKBsL3W

— IndianPremierLeague (@IPL) May 14, 2023

172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆరంభం ఫెయిల్ అయింది. యశస్వి జైస్వాల్ రెండో బంతికే ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. సిరాజ్ వేసిన బంతికి భారీ షాట్‌ కొట్టే క్రమంలో యశస్వీ.. కోహ్లీకి సులువైన క్యాచ్‌ ఇచ్చాడు. జోస్ బట్లర్ కూడా అదే తప్పు చేశాడు. తరువాతి ఓవర్‌లో, సిరాజ్, వేన్ పార్నెల్‌కి క్యాచ్ ఇచ్చాడు.

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ తిరిగి పెవిలియన్ చేరిన తర్వాత రాజస్థాన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత కెప్టెన్ సంజూ శాంసన్ భుజాలపై పడింది. అయితే సంజూ మరోసారి తడబడ్డాడు. సంజు కేవలం 5 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఈ విధంగా, రాజస్థాన్ టాప్ ఆర్డర్ కేవలం నాలుగు పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నారు.

Read More: High Alert: ఏపీలో హై అలర్ట్‌, వచ్చే రెండు రోజులు జాగ్రత్త!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 59 all out
  • IPL 2023
  • RR vs RCB
  • RR vs RCB Highlights
  • worst record

Related News

    Latest News

    • Gaza : గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా

    • Poonam Kaur : పూనమ్ కౌర్ ట్వీట్‌పై బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. !

    • Local Body Elections Telangana : ఎన్నికల్లో ఖర్చు చేయాలా? వద్దా? అనే అయోమయంలో నేతలు

    • Ind Vs Pak : మళ్లీ పాక్తో తలపడనున్న భారత్

    • Astrology : ఈ వారం దసరా పండుగ వేళ ఈ 5 రాశులకు రెట్టింపు లాభాలు..!

    Trending News

      • Donald Trump: ట్రంప్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం.. సినిమాల‌పై 100 శాతం టారిఫ్‌!

      • Speed Post: 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత స్పీడ్ పోస్ట్‌లో భారీ మార్పులు!

      • India: ఐసీసీ టోర్న‌మెంట్ల నుండి టీమిండియాను స‌స్పెండ్ చేయాలి: పాక్ మాజీ ఆట‌గాడు

      • Team India: ఆసియా క‌ప్ ట్రోఫీ లేకుండానే సంబ‌రాలు చేసుకున్న టీమిండియా!

      • Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకుల సెలవుల పూర్తి జాబితా ఇదే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd