Rajani: రాష్ట్ర గిడ్డంగుల చైర్‌పర్సన్‌గా రజని పదవీ బాధ్యతల స్వీకరణ
రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా వేద రజని పదవీ బాధ్యతలు స్వీకరించారు.
- Author : Balu J
Date : 20-07-2023 - 2:45 IST
Published By : Hashtagu Telugu Desk
రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా వేద రజని పదవీ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి,ఎమ్మెల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మఠం బిక్షపతి కి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ గారు ఎంతో నమ్మకంతో గొప్ప అవకాశం కల్పించారని, ప్రజలకు మంచి సేవలు అందించేలా పని చేయాలని మంత్రి ఆకాంక్షించారు.
Also Read: Treadmill Shocked: ట్రెడ్‌మిల్ పై జిమ్ చేస్తుండగా షాక్.. అక్కడికక్కడే యువకుడు మృతి!