Siddarth : పుష్ప-2 ఈవెంట్‌పై హీరో సిద్దార్థ్ వివాదాస్పద వ్యాఖ్యలు
Siddarth : పాట్నాలో జరిగిన ఈ ఈవెంట్‌పై హీరో సిద్ధార్థ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నోరు పారేసుకున్నారు. ఆయన నటించిన 'మిస్ యు' సినిమా ఈ నెల 13న విడుదల కానుంది.
- By Kavya Krishna Published Date - 11:28 AM, Wed - 11 December 24

Siddarth : డిసెంబర్ 5న విడుదలైన సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటించిన పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో నిర్వహించగా, దాదాపు 3 లక్షల మందికి పైగా భారీ జనసంద్రం పాల్గొనడం మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ ఈవెంట్‌పై నటుడు సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆయన తన రాబోయే చిత్రం మిస్ యూ ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ పాట్నా ఈవెంట్‌కు భారీ జనసంద్రం చేరడాన్ని ‘మార్కెటింగ్’ మాత్రమే అని వ్యాఖ్యానించారు. “రోడ్డు మీద జేసీబీ పని జరిగితే కూడా జనాలు చేరుతారు,” అని చెప్పిన సిద్ధార్థ్, ఈ జనసంద్రం ఎంతో ప్రాముఖ్యతను కలిగి లేదని సూచించారు.
Nitin Rabinhood : నితిన్ సినిమా వాయిదా పడుతుందా..?
దీనితో పాటు, బీహార్‌లో పెద్ద గ్రౌండ్ బ్లాక్ చేసి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే సహజంగానే జనాలు చేరతారని పేర్కొన్నారు. అంతేకాకుండా, రాజకీయ ర్యాలీలకు ప్రజలను ఆకర్షించేందుకు బిర్యానీ ప్యాకెట్ లేదా మద్యం బాటిల్ వంటి ఆఫర్లు చేస్తే జనాలు చేరతారని వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. ఈ తరహా సభలు రాజకీయ విజయానికి మార్గం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
సిద్ధార్థ్ ఈ వ్యాఖ్యలు చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో ఆయనపై విరుచుకుపడ్డారు. “ఇలాంటివి మాట్లాడడం వల్లే ఆయన టాప్ హీరో స్థాయిని కోల్పోయారు” అంటూ, సిద్ధార్థ్‌ను విమర్శిస్తూ, అతని పదునైన మాటలే తన కెరీర్‌ను ప్రభావితం చేశాయని అభిప్రాయపడ్డారు. ఈ వివాదం ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే… సిద్ధార్థ్ నటించిన తాజా రొమాంటిక్ చిత్రం మిస్ యు మొదట నవంబర్ 29, 2024న విడుదల చేయాలని భావించారు, అయితే తమిళనాడులో తుఫాను ప్రభావంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు, మేకర్స్ అధికారికంగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 13, 2024న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఎన్. రాజశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
FSSAI : న్యూస్ పేపర్లలో ఫుడ్ ప్యాకింగ్.. ఎంత డేజంరో తెలుసా..?