HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Pulasa Fish Record Price

Pulasa Fish : యానంలో రికార్డు ధర పలికిన పులస చేప…

'పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి' అంటారు. అంత ప్రత్యేకం పులస చేప

  • Author : Sudheer Date : 23-08-2023 - 1:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pulasa Fish Price
Pulasa Fish Price

‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ అంటారు. అంత ప్రత్యేకం పులస చేప (Pulasa ). పులస చేప వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. ఈ చేప అన్ని చేపల కన్నా చాలా రుచిగా ఉంటుంది. పులస చేప పులుసు ఉభయ గోదావరి జిల్లాలలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం. కొన్ని ఏండ్ల క్రితం ఇక్కడి జనం ఎవరినైనా ముఖ్యమైన వారిని కలవడానికి వెళ్ళేటప్పుడు ఈ పులస చేప పులుసు పట్టుకుని వెళ్ళేవారట. అంతటి ప్రత్యేకమైనది. అందుకే పులస ను భారీ ధర పెట్టి కొనుగోలు చేస్తారు. చేపల వేటకు వెళ్లే జాలర్లకు పులస చేప చిక్కిందంటే వారి పంట పండినట్లే.

తాజాగా యానంలో రికార్డు ధరకు పులస అమ్ముడుపోయింది. వర్షాకాలం సీజన్‌లో తొలకరి తర్వాత గోదావరికి ఎర్ర నీరు పోటెత్తిన సమయంలోనే పులసలు దొరుకుతాయి. ఈ ఏడాది మాత్రం పులసలు కాస్త తక్కువగానే మార్కెట్‌లోకి వస్తున్నాయి. గత నెలలో ఒకటి రెండుసార్లు మాత్రమే మత్స్యకారుల వలకు చిక్కగా మళ్లీ చాలా రోజుల తర్వాత పులస దొరికింది. యానాంలో రెండు కిలోల పులస చేప చిక్కింది.

ఆ పులస చేపను మార్కెట్‌లో అమ్మకానికి పెట్టారు. మత్స్యకార మహిళ రత్నం అమ్మకానికి పెట్టడంతో కొనుగోలు చేసేందుకు పులస ప్రియులు పోటీపడ్డారు. ఈ చేప రికార్డు స్థాయిలో ఏకంగా రూ.16వేలకు అమ్ముడుపోయింది. గతంతో పోలిస్తే.. గోదావరిలో పులస చేప రాక బాగా తగ్గిందనే చెబుతున్నారు.

ఈ పులస (Pulasa Fish Speciality) ప్రత్యేకలు చూస్తే..

పులసలు.. గోదావరి నదిలో మాత్రమే ఉంటాయి.. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకతగా చెబుతారు స్థానిక మత్స్యకారులు. సంతానోత్పత్తి కోసం న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి వస్తాయట. అలా హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయని చెబుతుంటారు.

ఈ చేప సంతానోత్పత్తి సమయంలో గుడ్లు పెట్టేందుకు ఇలా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల సముద్ర జలాల్లోకి వస్తుందని మత్స్యకారులు చెబుతుంటారు. సీజనల్‌గా ఆషాడ, శ్రావణ మాసాల్లో ఇక్కడ గుడ్లు పెట్టి మళ్లీ సముద్రంలోకి తిరిగి వెళ్లిపోతుందట. ఇలసగా పిలిచే ఈ చేప గోదావరిలోకి ఎర్రనీరు రాగాగానే.. ఎదురీదుతూ నదిలోకి వచ్చి రెండు మూడు రోజుల్లోనే పులసగా మారుతుందని చెబుతారు మత్స్యకారులు.

పులస శాస్త్రీయ నామం హిల్సాహిల్సా అంటారట. ఈ పులసలు ఒడిశాతో పాటుటా బంగ్లాదేశ్ తీరాల్లో కూడా దొరుకుతాయట.. కానీ గోదావరిలో దొరికే చేపల రుచి వేరుగా ఉంటుందని చెబుతారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఈ పులస చేపలు ఎక్కువగా భైరవపాలెం, అంతర్వేది, నరసాపురంలో కనిపిస్తాయి అంటున్నారు. మరీ ముఖ్యంగా గోదావరి జలాలు సముద్రంలో కలిసే ఈ రెండు పాయల దగ్గరే ఈ పులస చేపలు లభ్యం అవుతాయని మత్స్యకారులు అంటున్నారు. అందుకే ఈ పులస చేపల కోసం వేటకు వెళుతుంటారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • pulasa
  • pulasa fish
  • pulasa fish price
  • pulasa fish season
  • pulasa fish speciality
  • why pulasa fish is costly
  • yanam

Related News

Unified Family Survey

Janganana 2027: ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

రెండవ దశలో అసలైన జనాభా లెక్కింపు ప్రక్రియ 2027 ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో వ్యక్తుల వయస్సు, విద్య, ఉపాధి, మతం, భాష వంటి పూర్తి స్థాయి సామాజిక-ఆర్థిక వివరాలను సేకరిస్తారు. గత పదేళ్లకు పైగా కాలంలో రాష్ట్ర జనాభాలో వచ్చిన మార్పులు

  • Liquor Price Down

    Liquor Price : మందుబాబులకు డబుల్ కిక్..భారీగా తగ్గనున్న మద్యం ధరలు

  • Sarpanch Election Updates I

    Sarpanch Elections Updates in AP : ఏపీలో సర్పంచ్ ఎన్నికలు

  • Ap Ration Card Service Char

    Ration Card Service Charges : ఏపీలో రేషన్ కార్డు సర్వీస్ ఛార్జీలు పెంపు!

  • Anganwadi Workers ...

    Anganwadi Workers : ఏపీలోని అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్

Latest News

  • పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

  • Tirumala : తిరుమల వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త

  • మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

  • Open Offer : మావోయిస్టులకు కొత్తగూడెం ఎమ్మెల్యే ఓపెన్ ఆఫర్ !!

  • Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd