Dry Hair: కేశ సంపద తరగొద్దంటే…ఇవి ఫాలో అవ్వాల్సిందే..!!
ఆస్తులు పోయినా బాధపడరు కానీ...వెంట్రుకలు ఊడితే మాత్రం తట్టుకోలేరు. ముఖ్యంగా మహిళలు శిరోజాల రాలిపోకుండా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
- By Hashtag U Published Date - 01:45 PM, Sat - 23 April 22
ఆస్తులు పోయినా బాధపడరు కానీ…వెంట్రుకలు ఊడితే మాత్రం తట్టుకోలేరు. ముఖ్యంగా మహిళలు శిరోజాల రాలిపోకుండా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక్క వెంట్రుక ఊడితే…గుండె ఆగినట్లు ఫీలవుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో శిరోజాలు రాలిపోవడం అనే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. జుట్టు రాలిపోతున్నా…నిర్లక్ష్యం చేసేవారూ ఉన్నారు. అదే సమయంలో జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు కొత్త కొత్త ప్రొడక్టులను వాడేవారూ ఉన్నారు. మార్కెట్లో దొరికే ఎన్ని ఉత్పత్తులు వాడినా…ఫలితాలు మాత్రం కనిపించకపోవడం చాలా మందికి ఎదురవుతున్న అనుభవం. దీనిపై డెర్మటాలజిస్టులు కొన్ని సూచనలు ఇస్తున్నారు.. అవేంటో చూద్దాం.
50-100 వెంట్రుకలు రాలిపోవడం సాధారణం…
రోజులో కనీసం 50 నుంచి 100 వెంట్రుకలు రాలిపోవడం సర్వసాధారణ విషయం అంతకంటే ఎక్కువగా రాలిపోతున్నట్లయితే…దాని సమస్యగా చూడాలి. కారణాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఇలా చేసినట్లయితే వెంట్రుకలు రాలిపోవడాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చు. తలగడపైన సిల్క్ కవర్ ను వాడుతుండాలి. దీనికి రాపిడి గుణం అనేది తక్కువగా ఉంటుంది. దీంతో వెంట్రుకలు ఊడిపోవు. ఇక శిరోజాలు అందంగా ఉండాలని చాలా మంది ఎన్నో రకాల రసాయన పదార్థాలు వినియోగిస్తుంటారు. ఇవి కేశాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
అందరికీ ఒకలా ఉండవు…
శిరోజాలు అందరికీ ఒకేవిధంగా ఉండవు. కాబట్టి ఎవరికి వారు వెంట్రుకల గుణానికి సరిపోయే షాంపూలు, కండీషనర్లనే మాత్రమే వాడాలి. హెయిర్ సీరం ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ వినియోగించడం వల్ల కేశాల పెరుగుదల కొంతమేరు పెంచుకోవచ్చు. అంతేకాదు వెంట్రుకల డ్యామేజీని కూడా తగ్గిస్తుంది. శారీరక వ్యాయామం వల్ల వెంట్రుకలకు రక్తప్రసరణ పెరగడంతో కూడా మంచి ఫలితాలు పొందవచ్చు.
ఒత్తిడికి దూరంగా..
వెంట్రుకలు రాలిపోయేందుకు ఒత్తిడి కూడా ముఖ్య కారణం అవుతుంది. అలాగే థైరాయిడ్ కంట్రోల్లో లేకపోయినా…జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటితోపాటు నిద్ర లేకపోయినా…ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది.
పోషకాహార లోపం…
వీటన్నింటితోపాటుగా పోషకాహార లోపం కూడా ఒక కారణం కావొచ్చు. ఆహారంలో విటమిన్ డి3 , విటమిన్ బి, జింక్ లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యులను సంప్రదిస్తే…వీటిని సూచిస్తారు. ఇక డ్యాండ్రఫ్ కూడా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతిస్తుంది. చుండ్రు ఉంటే శిరోజాలు రాలిపోతాయి కాబట్టి ఈ చర్యలు తీసుకుంటే…కేశాల సంపద తరిగిపోకుండా కాపాడుకోవచ్చు.
Tags
Related News
Hair Tips: షాంపూలో ఇదొక్కటి కలిపి ఉపయోగిస్తే చాలు.. రాలిపోయిన జుట్టు సైతం తిరిగి మొలవడం ఖాయం?
మామూలుగా అమ్మాయిలు పొడవాటి జుట్టు కావాలని కోరుకుంటూ ఉంటారు. అందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో అనే