Prostitution In Spa: మాసాజ్ మాటున వ్యభిచారం!
మాసాజ్ మాటున వ్యభిచారం దందా కొనసాగుతోంది. పేరుకు మసాజ్ సెంటర్లు అయినప్పటికీ.. లోపల మాత్రం
- By Balu J Updated On - 12:46 PM, Tue - 17 May 22

మాసాజ్ మాటున వ్యభిచారం దందా కొనసాగుతోంది. పేరుకు మసాజ్ సెంటర్లు అయినప్పటికీ.. లోపల మాత్రం గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో లెక్కకు మించి స్పా సెంటర్లున్నాయి. అందులో కొన్ని నిబంధన మేరకు నిర్వహిస్తున్నప్పటికీ, మరికొన్ని వ్యభిచారం దందాను కొనసాగిస్తున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న సెంటర్ పై పోలీసులు దాడి చేశారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఆపరేషన్ నిర్వహించారు. అక్కడ 9మంది అమ్మాయిలు, ఇద్దరు కస్టమర్స్ ను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మసాజ్ పేరుతో అమ్మాయిలే వ్యభిచారం నిర్వహిస్తూ దొరికిపోతున్నారు. ముంబై, ఢిల్లీ నుంచి అమ్మాయిలను రప్పించి మరి ఈ దందాలోకి దింపుతున్నారు.
ఇటీవలే బంజారాహిల్స్ కు చెందిన సంజన అనే యువతి ఢిల్లీకి చెందిన మసాజ్ థెరపిస్ట్ ను రప్పించి మరి వ్యభిచారంలోకి లాగింది. మొదట మసాజ్ కోసం ఆ అమ్మాయికి డబ్బు ఆశ చూపి ప్రలోభ పెట్టారు. దీంతో మసాజ్ థెరఫిస్ట్ ఓకే చెప్పింది. ఆమె తో పాటు మరో ఇద్దర్ని కస్టమర్స్ వద్దకు పంపించింది. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన మసాజ్ థెరపిస్ట్ చెప్పినట్టు గా వినలేదనే కారణంతో ఆమెపై దాడి చేశారు. వివస్త్రను చేసి కొట్టారు కూడా. దీంతో ఆ యువతి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసుల దాడుల నుంచి తప్పించుకునేందుకు కొందరు నిర్వాహకులు మసాజ్ మాటున వ్యభిచారం నిర్వహిస్తూ దొరికిపోతున్నారు.
Related News

Amit Shah: వచ్చే 30 – 40 ఏళ్లు అధికారం బీజేపీదే.. భారత్ విశ్వగురు అవుతుంది : అమిత్ షా
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ దూకుడు మీదుంది. అందుకే అది మాట్లాడే ప్రతి మాటలోనూ ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది.