FNCC Elections : ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడిగా ఘట్టమనేని ఆదిశేషగిరిరావు
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల్లో డా.కేఎల్ నారాయణ, అల్లు అరవింద్...
- Author : Prasad
Date : 26-09-2022 - 7:23 IST
Published By : Hashtagu Telugu Desk
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల్లో డా.కేఎల్ నారాయణ, అల్లు అరవింద్, సురేష్ బాబు ప్యానెల్ విజయం సాధించింది. అన్ని స్థానాలనూ వీరి ప్యానెల్ గెల్చుకోవడం విశేషం. ఎఫ్‌ఎన్‌సీసీలో మొత్తం 1991 మందికి ఓటు హక్కు కలిగి ఉన్నారు. అధ్యక్షుడిగా నిర్మాత జి. ఆదిశేషగిరిరావు గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా తుమ్మల రంగారావు, కార్యదర్శిగా ముళ్లపూడి మోహన్ విజయం సాధించారు. ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన నిర్మాత బండ్ల గణేష్, కార్యదర్శిగా పోటీ పడిన నిర్మాత కేఎస్ రామారావు ఓటమి చెందారు.