Omicron: హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్ కి ఓమిక్రాన్
తెలంగాణలో ఓమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మంగళవారం మరో నాలుగు ఓమిక్రాన్ కేసులు నమోదవ్వగా మొత్తం 24 కేసులకు చేరింది.
- By Hashtag U Published Date - 10:29 PM, Tue - 21 December 21
తెలంగాణలో ఓమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మంగళవారం మరో నాలుగు ఓమిక్రాన్ కేసులు నమోదవ్వగా మొత్తం 24 కేసులకు చేరింది.
ముగ్గురు నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన వారికి ఓమిక్రాన్ నిర్ధారణ అవ్వగా, కాంటాక్ట్ ట్రెసింగ్ లో ఒకరికి ఒమిక్రాన్ వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు.
సోమాలియా నుంచి వచ్చిన ఒక విదేశీయుడు ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం పొందడంతోట్రీట్మెంట్ అందించిన వైద్యుడికి ఒమిక్రాన్ సోకింది. ఇక డాక్టర్ భార్యకు కూడా కరోనా నిర్ధారణ కావడంతో ఆ డాక్టర్ భార్య శాంపిల్ ను జినోమ్ సిక్వెన్సింగ్ కు పంపించారు.
ఇక ఆ డాక్టర్ కు కాంటాక్ట్ అయిన వారి శాంపిల్స్ ను సేకరించడంతో పాటు కాంటాక్ట్ హిస్టరీలో ఉన్నవారిని క్వారయిటైన్ లో ఉంచారు.
Related News
New COVID Variant: కరోనా నుంచి మరో కొత్త రకం.. భారత్లో పెరుగుతున్న ఆందోళన
భారతదేశంలో కరోనా వైరస్ మరోసారి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉద్రిక్తతను సృష్టిస్తోంది.